భగవంత్ కేసరి.. టోటల్ ఎన్ని థియేటర్స్ వచ్చాయంటే..
ఓవర్సీస్ లో 350 థియేటర్స్ తో కలుపుకొని 1345 థియేటర్స్ లో భగవంత్ కేసరి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి సిద్ధమవుతోన్న మూవీ భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిధమైన ఈ సినిమాని చూసేందుకు నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా ట్రైలర్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని బాలయ్య భావిస్తున్నారు.
అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ మూవీతో పాటుగా లియో చిత్రం కూడా థియేటర్స్ లోకి రాబోతోంది. అయితే భగవంత్ కేసరి చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో భాగానే థియేటర్స్ దొరికినట్లు కనిపిస్తోంది. నైజాంలో 285+ థియేటర్స్, సీడెడ్ లో 200+, ఆంధ్రాలో 410 థియేటర్స్ లో భగవంత్ కేసరి రిలీజ్ కాబోతోంది.
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 100 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. ఓవర్సీస్ లో 350 థియేటర్స్ తో కలుపుకొని 1345 థియేటర్స్ లో భగవంత్ కేసరి మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. 68.50 కోట్ల బ్రేక్ ఎవెన్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. బ్రేక్ ఎవెన్ టార్గెట్ చూసుకుంటే తక్కువగానే ఉందని చెప్పాలి. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం ఈ కలెక్షన్స్ మొదటి వారంలోనే వచ్చేసే అవకాశం ఉంది.
అనిల్ రావిపూడి ఈ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శ్రీలీల మూవీలో బాలయ్య కూతురిగా కనిపిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూసుకుంటే భగవంత్ కేసరి కంటే లియోకి ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే మొదటి రోజు నందమూరి ఫ్యాన్స్ నుంచి ఫుల్ రష్ ఉంటుందని చెప్పొచ్చు. కూతురు సెంటిమెంట్ తో వస్తోన్న మూవీ కావడంతో కచ్చితంగా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.