'భగవంత్ కేసరి' పై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాతలు!
'స్వామి' చిత్రానికి...'భగంవత్ కేసరి'కి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది పూర్తిగా కొత్త కంటెట్ తో ...ప్రెష్ ఫీల్ ని అందించే సినిమా అని ...ఏ చిత్రానికి రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు.
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.' అఖండ'..'వీరసింహారెడ్డి' లాంటి వరుస విజయాలతో ఊపు మీదున్న బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ నమోదు చేస్తారని అంచనాలున్నాయి. బాలయ్య యాక్షన్..అనీల్ మార్క్ ఎంటర్ టైనింగ్ తో ప్రేక్షకుల అంచనాలు మించి ఉంటుందని అభిమానలు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
అయితే ఈ సినిమా 'స్వామి' చిత్రానికి రీమేక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కొన్నేళ్ల క్రితం హరికృష్ణ..మీనా జంటగా నటించిన 'స్వామి' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో హరికృష్ణ పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పవర్ ఫుల్ పాత్రలో హరికృష్ణ నటన నందమూరి అభిమానులకు ఓ ట్రీట్ లా నిలిచింది. ఈ నేపథ్యంలో బాలయ్య శైలికి తగ్గట్టు అన్నయ్య పాత్రలాగా బాలయ్య రోల్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఆ పాయింట్ ని బేస్ చేసుకునే అనీల్ స్టోరీ రాసినట్లు వార్తలొస్తున్నాయి.
తాజాగా వాటన్నింటిని నిర్మాతలు ఖండిచారు. 'స్వామి' చిత్రానికి...'భగంవత్ కేసరి'కి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది పూర్తిగా కొత్త కంటెట్ తో ...ప్రెష్ ఫీల్ ని అందించే సినిమా అని ...ఏ చిత్రానికి రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఇలాంటి వదంతులు సృష్టించొద్దన్నారు. భారీ యాక్షన్ ఫీట్ ని ఆస్వాదించేందుకు అక్టోబర్ 19వ వరకూ వెయిట్ చేయాలని అభిమానుల్ని కోరారు.
దీంతో 'భగవంత్ కేసరి'కి-'స్వామి'కి ఎలాంటి సబంధం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకూ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రాలన్నీ తన సొంత కథలే. రీమేక్ లు తెరకెక్కించలేదు. 'ఎఫ్-2' సీక్వెల్ గా 'ఎఫ్ -3' నిమాత్రమే తెరకెక్కించారు. ఆ వెంటనే బాలయ్య సినిమాపై ఫోకస్ చేసారు. 'భగవంత్ కేసరి' ఫలానా సినిమాకి రీమేక్ అనిగానీ..స్పూర్తి అని గానీ చెప్పింది లేదు. సొంత కథ కావడంతోనే ఎలాంటి ప్రకటనలు లేకుండా సెట్స్ కి వెళ్లిపోయారు.