నైజీరియాలో పెరిగిన హాట్ బ్యూటీ!

ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది. మ‌రి ఈ బ్యూటీ ఎక్క‌డ పుట్టి పెరిగిందో తెలుసా? అమ్మ‌డు ఔరంగాబాద్ లో పుట్టింది. కానీ పెర‌గ‌డమంతా నైజీరియాలో.

Update: 2024-12-30 05:28 GMT

బాలీవుడ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. `యారియాన్ 2` తో బాలీవుడ్ లో లాంచ్ అయిన అమ్మ‌డు `చందు చాంపియ‌న్` తో మ‌రింత ఫేమ‌స్ అయింది. దీంతో టాలీవుడ్ కి ప్ర‌మోట్ అయింది. `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` లో మాస్ రాజా ర‌వితేజ‌కి జోడీగా న‌టించింది. కానీ తొలి సినిమా ప్లాప్ ఇచ్చినా? న‌టిగా పాస్ అయింది. వ‌చ్చిన అవకాశంతో ట్యాలెంటెడ్ గా నిరూపించుకుంది. దీంతో సొగ‌స‌రికి మ‌రో రెండు అవ‌కాశాలు వ‌రించాయి.

ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది. మ‌రి ఈ బ్యూటీ ఎక్క‌డ పుట్టి పెరిగిందో తెలుసా? అమ్మ‌డు ఔరంగాబాద్ లో పుట్టింది. కానీ పెర‌గ‌డమంతా నైజీరియాలో. ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కూ నైజీరియాలోనే స్కూలింగ్ పూర్తి చేసింది. అటుపై ముంబై షిప్ట్ అయిందిట‌. ఆ స‌మ‌యంలోనే చదువుకుంటూనే మోడ‌లింగ్ మొద‌లు పెట్టిన‌ట్లు తెలిపింది. డెయిరీ మిల్క్ యాడ్ తో మంచి పేరు రావ‌డంతో? అమ్మ‌డికి సినిమా ఛాన్సులు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించింది.

సాధార‌ణంగా ధ‌న‌వంతులంతా అభివృద్ది చెందిన దేశాల్లో చ‌దువుకుంటారు. అక్క‌డే స్థిర‌ప‌డ‌టానికి చూస్తారు. కానీ భాగ్య శ్రీ మాత్రం ఆర్దికంగా వెనుక‌బ‌డిని దేశంలో స్కూలింగ్ పూర్తి చేయ‌డం అన్న‌ది ఇంట్రెస్టింగ్. అదీ భార‌త్ ముంబై నుంచి నైజీరియా వెళ్ల‌డం విశేషం. మ‌రి ఆ ప్ర‌యాణం వెనుక ఇంకేదైనా స్టోరీ ఉందా? అన్న‌ది తెలియాలి.

ఇక టాలీవుడ్ లో భాగ్య శ్రీ లైన‌ప్ చూస్తే ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ , రానా న‌టిస్తోన్న `కాంత‌`లో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇది భాగ్య‌శ్రీకి రెండ‌వ సినిమా. ఇటీవ‌లే మూడ‌వ ప్రాజెక్ట్ కూడా ఖాతాలో వేసుకుంది. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ సినిమా నిర్మిస్తుంది. ఇందులో రామ్ కి జోడీగా భాగ్య‌శ్రీని ఎంపిక చేసారు. ఈ రెండు సినిమా విజ‌యాలు అమ్మ‌డ‌కు కీల‌కం కానున్నాయి. ఎంత గొప్ప పెర్పార్మ‌ర్ అయినా టాలీవుడ్ లో స‌క్సెస్ లేనిదే త‌దుప‌రి అవ‌కాశాలు క‌ష్టం.

Tags:    

Similar News