భజన బ్యాచ్ శ్రీలీలనీ వదిలి పెట్టలేదు!
అవి నమ్మి తానెంత మోసపోయానో విలవిలాడింది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు ఈరకమైన ఉచ్చులో పడొద్దని సజ్జెస్ట్ చేసింది.
ఇండస్ట్రీలో భజన బ్యాచ్ లకు కొదవలేదు. ఎక్కడిక్కడ ఈ బ్యాచ్ లు హీరోల చుట్టూ..హీరోయిన్లు చుట్టూ తిరుగుతుంటాయి. భజనలో భాగంగా బోలెడన్ని ఉచిత సలహాలు ఒల్లబొస్తుంటారు. ఇలా సలహాలకు బలమైన హీరోయిన్లు..హీరోలు చాలా మందే ఉన్నారు. ఇటీవలే పాయల్ రాజ్ పుత్ విషయంలో వెనుక తిరిగి సలహాలిచ్చే భజన బ్యాచ్ ఎలా ఉంటుందో రివీల్ చేసింది. ఏ సినిమా చేయాలి? ఎలాంటి పాత్ర పోషించాలి? అందుకు ఇది సరైన సమయమా? కాదా? నానా సలహాలు అడగకుండానే ఇచ్చేస్తారని అంది.
అవి నమ్మి తానెంత మోసపోయానో విలవిలాడింది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారు ఈరకమైన ఉచ్చులో పడొద్దని సజ్జెస్ట్ చేసింది. తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలలకు సలహాలు ఇచ్చే వారు చాలా మంది ఉన్నారని తెలిపింది. పాయల్ రాజ్ పుత్ కి ఇచ్చిన సలహాలే శ్రీలలకి ఇచ్చారుట. కానీ శ్రీలీల వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపింది. హీరోయిన్ గా కెరీర్ బాగుంది. అప్పుడే కుమార్తె రోల్స్ చేయడం కరెక్ట్ కాదని..అలాగే ఇతర హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించడానికి ఇది సరైన సమయం కాదని చాలా సలహాలు ఇచ్చారుట.
అయితే వాటిని వేటిని శ్రీలీల చెవికి ఎక్కించుకోలేదుట. విని వదిలేస్తానని తెలిపింది. మళ్లీ ఇలాంటి సలహౄలు ఇవ్వకుండా కొన్ని సినిమాలు కమిట్ అయి సమాధానం ఇచ్చానంది. రెండు..మూడేళ్ల తర్వాత కుమార్తె పాత్రలు పోషించే అవకాశం రాదు. ఆ ఛాన్స్ ఇప్పుడు తీసుకుంటేనే వస్తుందని సినిమాలో నటించానని తెలిపింది. పరిపూర్ణ నటి అవ్వాలంటే కేవలం హీరోయిన్ పాత్రలే చేస్తే సరిపోదని..అన్ని రకాల పాత్రలు పోషించినప్పుడే పరిపూర్ణ నటి అవ్వుతామని తెలిపింది.
ప్రస్తుతం శ్రీలీల `భగవంత్ కేసరి` చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాలయ్యతో ఎక్కువ సన్నివేశాలు ఆమెకున్నాయి. అవి ప్రేక్షకుల్ని కదిలించేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ విషయంలో శ్రీలీల...కీర్తి సురేష్ ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆమె కూడా హీరోయిన్ గా నటిస్తూనే...స్టార్ హీరోల చిత్రాల్లో చెల్లి పాత్రలు...కుమార్తె పాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే.