భజే వాయువేగం మూవీ బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ లెక్కలు తేలినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే 4.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

Update: 2024-05-31 05:30 GMT

ఆర్ ఎక్స్ 100 మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన కార్తికేయ గత ఏడాది బెదుర్లంక మూవీతో హిట్ అందుకున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సారి దానికి కంప్లీట్ అపోజిట్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో భజే వాయువేగం అంటూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంటూ ఆకట్టుకుంది. కార్తికేయ స్పీడ్ కి కరెక్ట్ గా సరిపోయే కథతో భజే వాయువేగం మూవీ రాబోతోందనే మాట వినిపిస్తోంది.

మూవీ ట్రైలర్ బాగుండటంతో సినిమాపైన అంచనాలు పెరిగాయి. ఈ రోజు థియేటర్స్ లోకి రాబోయే భజే వాయువేగం మూవీ తెలుగు రాష్ట్రాలలో 3.4 కోట్ల బిజినెస్ వేల్యూ కలిగి ఉందని టాక్. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ లెక్కలు తేలినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవాలంటే 4.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో 300 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా 400 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారంట. ఇక ఈ మూవీ కంటెంట్ కమర్షియల్ అంశాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో ఉంది. సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఈ నేపథ్యంలో భజే వాయువేగం సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.

పెద్ద ప్రొడక్షన్స్ ముందుకొచ్చి ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నాయి. దీంతో కచ్చితంగా సాలిడ్ గా ఆడియన్స్ థియేటర్స్ వస్తారని భావిస్తున్నారు. ఇక మౌత్ టాక్ ఎలాగూ పాజిటివ్ గా జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమాకి పోటీగా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గంగం గణేశా చిత్రాలు ఉన్నాయి. ఈ మూడింటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పైన పబ్లిక్ ఇంటరెస్ట్ ఎక్కువగా ఉంది. రెండో స్థానంలో భజే వాయువేగం నిలిచింది.

కార్తికేయ ఈ సినిమాతో హిట్ కొడితే అతని మార్కెట్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఏడాదికి ఒక సినిమాతోనే ప్రేక్షకుల ముందుకి వస్తోన్న కూడా డిఫరెంట్ కథలతో కార్తికేయ జర్నీ చేస్తూ ఉండటం చెప్పుకోదగ్గ విషయం. అలాగే హీరోగానే కాకుండా విలనీ రోల్స్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే తమిళంలో అజిత్ మూవీలో విలన్ గా మెప్పించిన కార్తికేయ తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ లో కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు.

Tags:    

Similar News