అనన్య బ్రేకప్ కొత్త డేట్ గురించి మమ్మీకి ప్రశ్న
ఊహించని ఈ మలుపునకు కారణమేమిటో ఎవరూ బహిరంగంగా నోరు విప్పలేదు.
అనన్య పాండే - ఆదిత్య రాయ్ కపూర్ జంట ప్రేమాయణం, ఇటీవలి బ్రేకప్ వ్యవహారం తెలిసిందే. ఈ జంట అనూహ్యంగా బ్రేకప్ చెప్పేయప్పడం ఆశ్చర్యపరిచింది. ఊహించని ఈ మలుపునకు కారణమేమిటో ఎవరూ బహిరంగంగా నోరు విప్పలేదు. అయితే అమ్మాయి లేదా అబ్బాయికి హార్ట్ బ్రేక్ అయినప్పుడు మొదటగా బాధపడేది, కలతకు గురయ్యేది తల్లిదండ్రులు మాత్రమే. అనన్య పాండే బ్రేకప్ వార్త తెలిసాక .. ఆమె మాతృమూర్తి భావనా పాండే ఏమని ఫీలయ్యారు? అంటే అది నిజానికి కొందరికీ షాకింగ్ గానే ఉంటుంది.
తాజాగా అనన్య తల్లి భావన పాండే తన కుమార్తె డేటింగ్ పుకార్ల గురించి మాట్లాడారు. అనన్య సాధారణ జీవితాన్ని గడపాలని.. ఆమె వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజున సంతోషంగా ఉంటుందని భావిస్తున్నట్లు భావన పాండే పేర్కొన్నారు. `ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ సీజన్ 3` ఎపిసోడ్‌లో సీనియర్ భామలంతా దిల్లీలోని ఒక కళాశాల ఈవెంట్‌కి హాజరు కాగా, ఈవెంట్లో యువతరం నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. భావన తన స్నేహితులు, సహనటులు మహీప్ కపూర్, నీలం కొఠారి - సీమా సజ్దేహ్‌లతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఒక విద్యార్థి అనన్యపై లింకప్ వార్తలు లేదా కొత్త డేటింగ్ గురించిన వార్తలు వచ్చినప్పుడు ఒక మాతృమూర్తిగా ఎలా ఫీలవుతారు? అని ఒక విద్యార్థి భావన పాండేను ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ, ``నేను చిన్నతనంలో చాలా మందితో స్నేహంగా ఉన్నాను. అయితే అవేవీ హెడ్ లైన్స్ లోకి వెళ్లలేదు. ఈ తరం కూడా అంతే. కానీ అప్పటికి ఇప్పటికీ ప్రచారం ఒక్కటే తేడా. కాబట్టి అనన్య వ్యక్తిగత జీవితాన్ని నేను నడిపించడం లేదు. తను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ రోజు నాకు చెబుతుంది. బహుశా నేను భావోద్వేగానికి లోనవుతాను. అప్పటి వరకు ఆమె గొప్ప సమయాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను.. అని అన్నారు. అనన్య డేటింగ్ వ్యవహారాలను తాను పర్యవేక్షించలేనని సుత్తి లేకుండా సూటిగా చెప్పేశారు భావన పాండే.
ఆదిత్యరాయ్ కపూర్ నుంచి విడిపోయాక.. గత కొన్ని వారాలుగా అనన్య - అమెరికన్ మోడల్ వాకర్ బ్లాంకో మధ్య రిలేషన్ షిప్ గురించిన ఊహాగానాలు సాగుతున్నాయి. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకల్లో అనన్య కు జతగాడిగా వాకర్ హాజరైనట్లు కథనాలొచ్చాయి. అయితే ఈ పుకార్లపై అనన్య - వాకర్ ఇద్దరూ మౌనంగా ఉన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అనన్య పాండే చివరిగా CTRLలో కనిపించింది. ఈ చిత్రం అభిమానులు, విమర్శకుల నుండి సానుకూల స్పందనలను పొందింది. తదుపరి అనన్య `కాల్ మి బే` సీజన్ 2లోను నటించింది. అక్షయ్ కుమార్, ఆర్.మాధవన్‌లతో ధర్మ ప్రొడక్షన్స్ సినిమాలోను అనన్య నటిస్తోంది.