టెక్నాలజీ సహాయంతో ఆమె గాత్రాన్ని మళ్లీ తెచ్చారుగా!
దివంగత గాయని భవతారణి వాయిస్ నీ సైతం ఏఐతో శ్రోతలకు వినిపిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వాడుకున్న వాడుకున్నంత కంపర్టుబుల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏఐతో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. లేని నటుల్ని ఉన్నట్లు సృష్టించి అంతే నేచురాలిటీని తీసుకొస్తున్నారు. మ్యూజిక్ పరంగానూ ఈ టెక్నాలజీ ఎంతో వాడుకలోకి వచ్చేసింది. తాజాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమార్తె, దివంగత గాయని భవతారణి వాయిస్ నీ సైతం ఏఐతో శ్రోతలకు వినిపిస్తున్నారు.
ప్రస్తుతం తలపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు గోట్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగానే భవతారణి క్యాన్సర్ తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఆమె సినిమాలో కొన్ని పాటలు పాడారు. అయితే ఆమె మరణంతో కొన్ని పాటలు పెండింగ్ ఓ పడటంతో ఏఐ సహయంతో ఆమె గాత్రాన్ని పున సృష్టిస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు రివీల్ చేసారు.
గోట్ సినిమా కోసం కంపోజ్ చేయాలనుకున్న చిన్న చిన్న కంగళ్ సాంగ్ థీమ్ గురించి యువన్ నాకు చెప్పారు. ఆ పాటను భవతారిణితో పాడించాలనుకున్నాం. కానీ ఆ సమయం లో తను అనారోగ్యంతో ఉంది. కోలుకుని చెన్నై వచ్చాక పాడతారనుకున్నాం. కానీ ట్యూన్ పూర్తయిన రోజే దురదృష్టవశాత్తూ ఆమె కన్నుమూసింది.
అప్పుడే ఏఐ గుర్తొచ్చింది. ఏఐతో దివంగత గాయకుడు రాహుల్ హమీద్ గాత్రాన్ని లాల్ సలామ్ సినిమా పాటలో వినిపించారు. దీంతో మేము అలా చేయాలని భావించి ఆ టెక్నాలజీ గురించి రెహమాన్ టీంను అడిగి తెలుసుకున్నాం. భవతారణి రా వాయిస్ తీసుకుని... మరో గాయని, ఏఐ సహాయంతో పాడించాం. మంచి ఔట్ ఫుట్ వచ్చింది. ట్యూన్ బాగా నచ్చడంతో విజయ్ పాటలో భాగమవుతున్నారు. అలా విజయ్, భవతారణి గాత్రంతో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింద`న్నారు