భోళా శంకర్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల లోనే 75 కోట్ల బిజినెస్ ఏరియాల వారీగా జరిగింది. ఆంధ్రాకి సంబందించిన రిలీజ్ రైట్స్ 37 కోట్లకి అమ్ముడయ్యాయి.

Update: 2023-08-02 03:47 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శాకత్వంలో తెరకెక్కుతోన్న భోళా శంకర్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. భారీ బడ్జెట్ తో వేదాళం రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రం నిర్మించారు. ఇప్పటికే భోళా శంకర్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది.

మెగాస్టార్ స్టైల్ లో సాగే పక్కా కమర్షియల్ మూవీగా భోళా శంకర్ మూవీ ఉండబోతోందని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. 11 ఏళ్ళ తర్వాత మెహర్ రమేష్ కి చిరంజీవి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చేశారు. దాని ని నిలబెట్టుకోవడానికి అన్ని లెక్కలు పక్కాగా వేసుకొని మెగాస్టార్ ఇమేజ్, చరిష్మాకి సరిపోయే విధంగా మాస్ అంశాలతో కథనం సిద్ధం చేసుకొని భోళా శంకర్ ప్రోడక్ట్ సిద్ధం చేసే పని లో ఉన్నారు.

ఈ మూవీ లో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. తమన్నా భాటియా హీరోయిన్ గా మెగాస్టార్ తో డ్యూయెట్లు పాడుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే బయ్యర్లు, డిస్టిబ్యూటర్స్ ఎగబడి కొనేస్తారు. అలాగే భోళా శంకర్ డిస్టి బ్యూటర్స్ నుంచి డిమాండ్ ఉండటంతో ఏకంగా 90 కోట్ల వరకు థీయాట్రికల్ బిజినెస్ జరిగిందంట. తెలుగు రాష్ట్రాల లోనే 75 కోట్ల బిజినెస్ ఏరియాల వారీగా జరిగింది. ఆంధ్రాకి సంబందించిన రిలీజ్ రైట్స్ 37 కోట్లకి అమ్ముడయ్యాయి. సీడెడ్ లో 13 కోట్లకి రైట్స్ ని దక్కించుకున్నారు.

నైజాం లో 25 కోట్ల మేర బిజినెస్ జరిగిందంట. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి 15 కోట్లకి డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇలా ఓవరాల్ గా ప్రస్తుత లెక్కలు చూసుకుంటే 90 కోట్లకి థీయాట్రికల్ వ్యాపారం జరిగిందని క్లారిటీ వస్తోంది. ఈ లెక్కల ప్రకారం 100 కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ తోనే సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. మరి ఈ బ్రేక్ టార్గెట్ ని చిత్రం ఏ మేరకు అందుకుంటుందనేది చూడాలి.

Tags:    

Similar News