భోళాశంకర్ యూఎస్ఏ కలెక్షన్స్.. ఇది పరిస్థితి
తాజాగా యూఎస్ఏ ప్రీమియర్స్ అండ్ ఫస్డ్ డే వసూళ్ల వివరాలు తెలిశాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' భారీ డిజాస్టర్ టాక్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్లో చిరు మరో డిజాస్టర్‌ను మూటగట్టుకున్నారు. సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా ట్రోల్సే తెగ ట్రెండ్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ అందరూ ఓ ఆటాడేసుకుంటున్నారు. మొదటి నుంచే ఈ సినిమాపై కాస్త హైప్ తక్కువ ఉండడంతో తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అలాగే ఓవర్సీస్లోనూ ఇదే జరిగింది.
తాజాగా యూఎస్ఏ ప్రీమియర్స్ అండ్ ఫస్డ్ డే వసూళ్ల వివరాలు తెలిశాయి. చిరంజీవి నటించిన గత సూపర్ హిట్ సినిమా వాల్తేరు వీరయ్య.. యూఎస్ఏలో ప్రీమియర్స్ ద్వారా 679కే డాలర్స్‌ను వసూలు చేస్తే.. టోటల్ థియేట్రికల్ రన్ టైమ్ పూర్తయ్యేసరికి 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుంది.
అయితే భోళాశంకర్ మాత్రం ప్రీమియర్స్ ద్వారా కేవలం 303కే డాలర్స్‌తో సరిపెట్టుకుంది. అంటే వాల్తేరు వీరయ్య కలెక్షన్లతో సగం అన్న మాట. ఇక ఫస్ట్ డే అయితే మరీ దారుణంగా 82కే డాలర్లను అందుకుంది. అంటే మొత్తంగా ప్రీమియర్స్- మొదటి రోజు కలిపి 358కే డాలర్స్‌ను ఖాతాలో వేసుకుంది.
ఈ కలెక్షన్స్ వివరాలు బయటకు రావడంతో ఈ మూవీ ఫస్ట్ వీకెండ్లో 600కే డాలర్ల మార్క్‌ను అందుకోవడం కష్టమని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు. ఈ సినిమా మొత్తం థియేట్రికల్ రన్ టైమ్ అయ్యేసరికి 1 మిలియన్ డాలర్ మార్క్‌ను చేరుకోవడం అసలు అయ్యే పనే కాదని అంటున్నారు.
దీంతో ఈ భోళాశంకర్ సినిమా డిజాస్టర్ టాక్ దిశగా దూసుకెళ్తోందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు భారీ డిజాస్టర్‌ను అందుకున్న ఆచార్య అయితే.. యూఎస్‌లో మొత్తం థియేట్రికల్ రన్ టైమ్ పూర్తయ్యేసరికి 985కె డాలర్లను కలెక్ట్ చేసింది. మరి కనీసం ఈ వసూళ్లనైనా భోళశంకర్ అందుకుంటుందో లేదో చూడాలి..
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 18.38 కోట్లు షేర్, 28.54లో గ్రాస్ మాత్రమే అందుకుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటిరోజు 15.38 కోట్లు షేర్, 22.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 79.60 కోట్లు. అంటే ఈ చిత్రం ఇంకా రూ. 62.12 కోట్ల వరకు అందుకోవాలి.