భూల్ భూలయ్యా- 3 టీజ‌ర్: న‌వ్విస్తూనే భ‌య‌పెడుతుంది!

కార్తీక్ ఆర్యన్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ హార‌ర్ కామెడీ `భూల్ భూలయ్యా 3` టీజర్ ఎట్టకేలకు విడుద‌లైంది.

Update: 2024-09-27 14:25 GMT

కార్తీక్ ఆర్యన్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ హార‌ర్ కామెడీ `భూల్ భూలయ్యా 3` టీజర్ ఎట్టకేలకు విడుద‌లైంది. హార‌ర్ కామెడీ ఫ్రాంఛైజీలో మూడో భాగం టీజ‌ర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. టీజర్‌లో కార్తీక్ ఆర్యన్‌తో పాటు విద్యాబాలన్, ట్రిప్తి డిమ్రీ పాత్ర‌లు ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. కార్తీక్, బాల‌న్ వంటి స్టార్ల ఎంట్రీ అదిరిపోయింది. వారి స‌న్నివేశాల్ని మ‌రో లెవ‌ల్ లో అనీస్ బ‌జ్మి ఆవిష్క‌రించారు. కానీ ఈ టీజ‌ర్ లో ఎక్క‌డా సీనియ‌ర్ న‌టి మాధురి ధీక్షిత్ క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీంతో అస‌లు మాధురి ఈ సినిమాలో న‌టిస్తోందా లేదా? అన్న సందిగ్ధ‌త ఏర్ప‌డింది. కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో అల‌రించిన విద్యా బాల‌న్ దెయ్యం ప‌ట్టిన యువ‌తి మంజులిక‌గా చాలా కాలానికి క‌నిపించ‌బోతోంది. ఆ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ఎంతో ఎంట‌ర్ టైనింగ్ గా మలిచార‌ని టీజ‌ర్ చెబుతోంది. ఇక భూల్ భూల‌యా ఎంట్రీ సీన్ కూడా అంతే ర‌క్తి కట్టించింది.

కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో టీజర్‌ను షేర్ చేస్తూ ``క్యా లగా కహానీ ఖతం హో గయీ !! రూహ్ బాబా వర్సెస్ మంజులికా..ఇస్ దీపావళి టీజర్ ఇప్పుడు విడుదలైంది !! ది ఎపిక్ హారర్ అడ్వెంచర్ ఈ దీపావళికి విడుద‌ల‌వుతోంది`` అని రాసాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో మిడ్ డే క‌థ‌నంలో మాధురీ దీక్షిత్ `భూల్ భూలయ్యా 3`లో దెయ్యం పాత్రను పోషిస్తోంద‌ని వెల్ల‌డించింది. ఈ సినిమాలో బాల‌న్ తో పోటీప‌డే దెయ్యంగా మాధురి ధీక్షిత్ క‌నిపిస్తుంద‌ని అంతా అంచ‌నా వేసారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. టీజ‌ర్ లో మాధురి పాత్ర‌ను అస్స‌లు ప‌రిచ‌యం చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీంతో అస‌లు మాధురి ధీక్షిత్ ఈ చిత్రంలో న‌టించారా లేదా? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

17 ఏళ్ల తర్వాత విద్యాబాలన్ తన ఐకానిక్ పాత్ర మంజూలికగా తిరిగి పునఃప్ర‌వేశం చేస్తోంది. ఈ పాత్ర‌ అభిమానులలో విపరీతమైన ఆస‌క్తిని పెంచింది. కార్తీక్, ట్రిప్తి, బాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన `భూల్ భూలైయా 3` ఈ దీపావళికి థియేటర్లలోకి వ‌స్తోంది. అజయ్ దేవగన్ సింగం ఎగైన్ తో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతోంది.

Full View
Tags:    

Similar News