ప్రేమికుల రోజున 'మనోజ్-మౌనిక' ఏం చేశారో చూడండి!
మంచు మనోజ్ - మౌనిక జంట ప్రేమ కథ ఒక సినిమా కథ కంటే తక్కువేమీ కాదు. ఎన్నో ఊహించని మలుపులు వారి జీవితంలో ఉన్నాయి
మంచు మనోజ్ - మౌనిక జంట ప్రేమ కథ ఒక సినిమా కథ కంటే తక్కువేమీ కాదు. ఎన్నో ఊహించని మలుపులు వారి జీవితంలో ఉన్నాయి. మనోజ్, మౌనిక హైదరాబాద్‌లో మనోజ్ సోదరి మంచు లక్ష్మి ప్రసన్న నివాసంలో ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. అంతకుముందు మనోజ్ - మౌనిక ఇద్దరూ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుకున్నారు. అక్కడ వారు కలుసుకున్నారు. స్నేహితులు అయ్యారు. మనోజ్ యాక్టింగ్ కోర్స్ చదువుతుండగా, మౌనిక బ్రాడ్‌కాస్ట్ జర్నలిజం విద్యను అభ్యసించారు. వారి స్నేహం ఆ తర్వాత కొన్ని పరిణామాల అనంతరం ప్రేమగా మారింది. వారు ఒకరి ఆసక్తులు అభిరుచుల గురించి తెలుసుకుంటూ కలిసి సమయాన్ని గడిపారు. క్రమంగా స్నేహాన్ని మించిన బలమైన బంధాన్ని కలిగి ఉన్నామని వారు గ్రహించడం ప్రారంభించారు.
వారి స్నేహం ప్రేమ నేపథ్యంలో మౌనిక తరపువారు ప్రతిపాదనకు అంగీకరించారు. మనోజ్ కూడా మౌనికతో ప్రేమలో పడిన విషయాన్ని గ్రహించాడు. వారి సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వెనకాడలేదు. మనోజ్ - మౌనిక కొంతకాలం పాటు తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచారు. అయితే వారు గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలోని గణేష్ మండపం వద్ద కనిపించినప్పుడు అది పబ్లిక్‌గా మారింది. ఆ సమయంలో వారి సంబంధం గురించి పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటిపై వ్యాఖ్యానించడానికి మనోజ్ నిరాకరించాడు. వివాహం కుదిరిన తర్వాత తమ రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గా ఓపెనయ్యారు. తమ ఆనందాన్ని తమ అభిమానులు శ్రేయోభిలాషులతో పంచుకున్నారు.
మనోజ్ - మౌనిక ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఇద్దరూ ఇంతకుముందు వివాహం చేసుకున్నారు. మనోజ్‌కి 2015 నుండి 2019 వరకు వేరొకరితో వివాహ బంధంలో ఉన్నారు. మౌనిక బెంగళూరుకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమెకు మునుపటి వివాహం నుండి ఒక కుమారుడు ఉన్నాడు.
మనోజ్ - మౌనిక ఇప్పుడు తమ జీవితంలో అత్యుత్తమ దశను అనుభవిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ పర్యాటక ప్రదేశాలు, శృంగార ప్రదేశాలను అన్వేషించడానికి వారు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నారు. జంటగా ఒకరికొకరు ప్రేమను సాంగత్యాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇప్పుడు ఒక బీచ్ డెస్టినేషన్ నుంచి ఆహ్లాదకరమైన రొమాంటిక్ మూడ్ లో ఉన్న ఫోటోని మనోజ్ షేర్ చేసాడు. ఇందులో తన భార్య మౌనికతో పాటు మనోజ్ సెలబ్రేషన్ ఆకట్టుకుంటోంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ జంట ఇలా అందమైన వెకేషన్ ని ప్లాన్ చేసారని అర్థమవుతోంది. ఈ ఫోటోకి అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు. '' ఈ వాలెంటైన్స్ డే ఫోటోలో అందమైన జంట స్వచ్ఛమైన ఆనందాన్ని ఆస్వాధిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన బంధం ... వారి అనుబంధం ఒక సుందరమైన వేడుక, #హ్యాపీవాలెంటైన్స్ డే 2024'' అని క్యాప్షన్ ఇచ్చారు.
మనోజ్ చివరిగా 2017లో ఒక్కడు మిగిలాడు చిత్రంలో కనిపించాడు. అతడు 2018లో ఇది నా లవ్ స్టోరీ - ఆపరేషన్ 2019 చిత్రాలలో అతిధి పాత్రల్లో నటించాడు. అహం బ్రహ్మాస్మి కాకుండా త్వరలో విడుదల కానున్న WTF - వాట్ ది ఫిష్‌లో కనిపించనున్నాడు.