థియేటర్ల పంపకంలో అక్కడా పెద్ద రాజకీయమేనా?
అందుకే చిన్న సినిమాకి థియేటర్లు దొరకడం లేదనే ఆవేదనలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తుంటాయి.
ఒకేసారి రెండు మూడు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలో థియేటర్ల సమస్య తలెత్తడం సహజం. ఎక్కువగా ఈ అంశం టాలీవుడ్..కోలీవుడ్ లో హైలైట్ అవుతుంటుంది. థియేటర్ చైన్ సిస్టమ్ అన్నది ఇక్కడ మిగతా భాషలకంటే భిన్నంగా ఉంటుంది. పిండె కొద్ది రొట్టె అన్నట్లు పలుకబడి కొద్ది థియేటర్ల పంపకం అన్నట్లు జరుగుతుంది. అందుకే చిన్న సినిమాకి థియేటర్లు దొరకడం లేదనే ఆవేదనలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తుంటాయి.
చాలాసార్లు దీనిపై పెద్ద ఉద్యమమే రగిలింది. అలాగని బాలీవుడ్ లో ఈ రకమైన ఇబ్బంది లేదని కాదు. అక్కడా ఉంది. కాకపోతే అక్కడ రోడ్డెకి రచ్చ చేసేంతగా సీన్ ఉండదు. ఎన్నిఉన్నా చివరి నిమిషంలో ఏదో రకమైన సర్దుబాటు దొరుకుతుంది. అయితే ఇంతవరకూ ఉన్నా మాట. నేడు అక్కడా తీరు మారుతున్నట్లే కనిపిస్తుంది. టాలీవుడ్.. కోలీవుడ్ తరహాలోనే అక్కడ కూడా పెద్ద ఎత్తున థియేటర్ల రాజకీయం నడస్తున్నట్లు తెరపైకి వస్తోంది.
నవంబర్ 1 దీపావళి సందర్భంగా ఒకే రోజు `సింగం అగైన్`, `భూల్ భులయ్యా 3` రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలకు థియేటర్ల పంపకం అన్నది సరిసమానంగా జరగలేదనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. సింగం ఎగైన్ కి అధిక మొత్తంలో కేటాయిస్తున్నట్లు...భూల్ భూలయ్యకి తక్కువగా కేటాయిస్తున్నట్లు వినిపిస్తుంది. సింగం ఎగైన్ కంటే? భూల్ భులయ్య 3 చిన్న సినిమా కావడంతో దీన్ని తొక్కేస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.
సింగం ఎగైన్ లో మెయిన్ హీరో అజయ్ దేవగణ్ అయినా అందులో చాలా మంది సూపర్ స్టార్లు యాడ్ అవ్వడంతో ఆ సినిమా భారీ కాన్వాస్ కోటాలోకి వెళ్లిపోయింది. ఈ సినిమా నిర్మాతలు సహా పంపిణీ చేసే వర్గమంతా కూడా బలమైన వ్యక్తలు కావడంతో భూల్ భులయ్య3కి అన్యాయం జరుగుతుందనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పుడీ వ్యవహారం సిసిఐ (కాంపిటీషన్ కమీషన్ అఫ్ ఇండియా) కు చేరిందని సమాచారం. రెండు సినిమాలకు సరిసమానంగా థియేటర్లు ఇవ్వాలనే డిమాండ్ ను భూల్ భులయ్య-3 మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.