సినిమాలకి ఇదే పెద్ద డ్యామేజ్
ఈ విషయాన్ని థియేటర్ మేనేజర్ వీడియోని టాక్ చేసి ఫస్ట్ హాఫ్ మాత్రమే కంప్లీట్ అయిన మూవీకి థియేటర్స్ బయట రివ్యూలు ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
ఈ మధ్యకాలంలో యుట్యూబ్ ఛానల్స్ లో పబ్లిక్ టాక్ అంటూ హడావిడి ఎక్కువ అయ్యింది. రివ్యూల కంటే ముందుగా జనం పబ్లిక్ టాక్ చూస్తారనే ఉద్దేశ్యంతో వందల సంఖ్యలో యుట్యూబ్ ఛానల్స్ పబ్లిక్ టాక్ అంటూ థియేటర్స్ దగ్గర హడావిడి చేస్తాయి. అయితే ఇలా పబ్లిక్ టాక్ ఇచ్చేవారిలో పబ్లిక్ కంటే పెయిడ్ ఆర్టిస్ట్స్ లు ఎక్కువ అవుతున్నారు.
ప్రతి సినిమాకి కామన్ గా కొంత మంది మాత్రం పబ్లిక్ ముసుగులో రివ్యూలు ఇచ్చేస్తూ ఉంటారు. కొన్ని సినిమాలకి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వీళ్ళు ఊదరగొడతారు. యుట్యూబ్ ఛానల్స్ కూడా వీరిని హైలైట్ చేస్తూ పబ్లిక్ టాక్ అంటూ పోస్ట్ చేస్తూ ఉంటాయి. కొన్ని యుట్యూబ్ ఛానల్స్ అయితే ఏవో పాత సినిమాలకి తీసుకున్న పబ్లిక్ టాక్ టాక్ లేటెస్ట్ మూవీస్ కి సంబందించిన టాక్ గా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు.
ఈ ట్రెండ్ ఈ మధ్యకాలంలో భాగా ఎక్కువైంది. కొంత మంది నిర్మాతలు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అయితే తాజాగా శుక్రవారం విడుదలైన ఓక సినిమాకి సంబందించిన యుట్యూబ్ లో పబ్లిక్ టాక్ అంటూ కొంతమంది రివ్యూలు చెప్పారు. అయితే ఆ సమయానికి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో కేవలం సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది.
ఈ విషయాన్ని థియేటర్ మేనేజర్ వీడియోని టాక్ చేసి ఫస్ట్ హాఫ్ మాత్రమే కంప్లీట్ అయిన మూవీకి థియేటర్స్ బయట రివ్యూలు ఇస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. అలాగే వినాయక నవరాత్రి నిమజ్జనం రోజున ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మూవీ రివ్యూ, పబ్లిక్ టాక్ అంటూ ఒక యుట్యూబ్ ఛానల్స్ వీడియో పోస్ట్ చేసింది.
నిజానికి ఆ రోజు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఓపెన్ చేయలేదు. కాని వ్యూస్ కోసం, ఫేక్ రివ్యూలు, ఫేక్ పబ్లిక్ టాక్ లు ఇచ్చే యుట్యూబ్ ఛానల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయాయని ఇలాంటి సంఘటన ద్వారా తెలిసిపోతోంది.