బిగ్ బాస్ 8 : ప్రభావతి పెట్టిన చిచ్చు.. హౌస్ మేట్స్ మధ్య గుడ్ల ఫైట్..!

బుధవారం ఎపిసోడ్ లో రెండు క్లాన్ చీఫ్ లను రేషన్ కోసం ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అది పూర్తి చేసి ఇద్దరు చీఫ్ లు వారి క్లాన్ కి కావాల్సిన రేషన్ ని సంపాదించారు.

Update: 2024-09-19 09:21 GMT

బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం ఇద్దరు చీఫ్ లు, రెండు క్లాన్లుగా ఏర్పడ్డారు. చీఫ్ గా నిఖిల్ మొదటి నుంచి కొనసాగుతుండగా లాస్ట్ వీక్ దాకా చీఫ్ లుగా ఉన్న నైనిక, యష్మిలల్ను తీసేసి కొత్తగా అభయ్ ని చీఫ్ గా ఎంపిక చేశారు. ఇక చీఫ్ లు నిఖిల్, అభ్య లకు రెండు క్లన్ల లో ఐదుగురు కంటెస్టెంట్స్ ని ఇచ్చారు. ఆ ఎంపిక హౌస్ మేట్స్ కే ఇవ్వడం జరిగింది. నిఖిల్ క్లాన్ లో సోనియా, విష్ణు ప్రియ, సీత, పృధ్వి, నైనిక ఉన్నారు. అభయ్ క్లాన్ లో ప్రేరణ, యష్మి, నబీల్, మణికంఠ, ఆదిత్య ఓం ఉన్నారు.

బుధవారం ఎపిసోడ్ లో రెండు క్లాన్ చీఫ్ లను రేషన్ కోసం ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అది పూర్తి చేసి ఇద్దరు చీఫ్ లు వారి క్లాన్ కి కావాల్సిన రేషన్ ని సంపాదించారు. దీనితో పాటుగా ప్రభావతి 2.ఓ అని సీజన్ 5 లో పెట్టిన గుడ్ల టాస్క్ ని మరోసారి రెండో వెర్షన్ గా తీసుకొచ్చారు. ప్రభావతి 2.ఓ లో కోడి గుండ్లు వస్తుంటాయి. రెండు క్లాన్ లు ఫైట్ చేసి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారు ఆ టాస్క్ విన్ అవుతారు.

ఐతే బుధవారం మాత్రం మొదటి రెండు ముగిసే సరికి నిఖిల్ క్లాన్ దగ్గర ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి. ఈ ఎగ్స్ కోసం పోరాడుతున్న క్రమంలో పృధ్వి మరోసారి ఎఫ్ వర్డ్ వాడుతూ మాట్లాడాడు. ప్రేరణ, ఆదిత్య ఓం పృధ్వి తో వాదన జరుపుతున్న టైం లో పృధ్వి బాగా హైపర్ అయ్యి ఎఫ్ వర్డ్ వాడాడు. లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లోనే పృధ్విని హోస్ట్ నాగార్జున ఎఫ్ వర్డ్ వాడొద్దని వార్నింగ్ ఇచ్చారు. కానీ పృధ్వి మళ్లీ అదే పంథా కొనసాగించాడు.

అభయ్, నిఖిల్ చీఫ్ లుగా కాస్త కూల్ గానే అనిపిస్తున్నా ప్రభావతి 2.ఓ టాస్క్ వల్ల హౌస్ మెట్స్ మధ్య గొడవ మొదలైంది. ఇక మరోపక్క ప్రేరణ తనకు దోశ వేసే విషయంలో ప్రవర్తించిన తీరుకి విష్ణు ప్రియ హర్ట్ అయ్యింది. ఆ తర్వాత ప్రేరణ కూడా విష్ణు ప్రియతో కలిసి ఆ విషయం గురించి డిస్కస్ చేసింది. ప్రభావతి 2.ఓ టాస్క్ లో నిఖిల్ ఒకసారి మణికంఠని లాగి అవతల పడేశాడు. ఆ టైం లో మణికంఠ తలకు దెబ్బ తగిలినట్టు ఉంది. అందుకే బిగ్ బాస్ మెడికల్ రూం కు పిలిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మణికంఠ మళ్లీ ఆటలో పాల్గొన్నాడు. ఐతే మొదటి రౌండ్ గెలిచిన నిఖిల్ టీం అభయ్ క్లాన్ నుంచి టాస్క్ లో ఒకరిని తీసేయాల్సి ఉంది. ఐతే నబీల్ కాస్త టఫ్ ఫైట్ ఇస్తాడని అతన్ని ఆట నుంచి తీసేశారు నిఖిల్ టీం. నెక్స్ట్ రౌడ్ కు నబీల్ సంచాలకుడిగా చేస్తాడని బిగ్ బాస్ చెప్పాడు.

Tags:    

Similar News