బిగ్ బాస్ 8 విజేత వెనక ఎన్నో ఓటములు..?

ఐతే ఈ టైం లో అసలు నిఖిల్ ఎవరు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఎక్కడ నుంచి వచ్చాడు లాంటి విషయాల మీద చర్చ నడుస్తుంది.

Update: 2024-12-16 07:13 GMT

బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిఖిల్ మాలియక్కల్ పేరు మారు మోగిపోతుంది. స్టార్ మా సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తూ వస్తున్న అతను ఈ సీజన్ లో మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెండర్ గా తన సత్తా చాటుతూ వచ్చాడు. 15 వారాలు.. 105 రోజుల నిరీక్షణలో ఫైనల్ గా నిఖిల్ సీజన్ 8 విన్నర్ గా కప్ ఎత్తాడు. ఐతే ఈ టైం లో అసలు నిఖిల్ ఎవరు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఎక్కడ నుంచి వచ్చాడు లాంటి విషయాల మీద చర్చ నడుస్తుంది.

నిఖిల్ మాలియక్కల్ కన్నడ నటుడు. మైసూర్ లో జన్మించాడు. తల్లి నటి, తండ్రి కూడా జర్నలిస్ట్ అవ్వడం వల్ల నిఖిల్ కి యాక్టింగ్ మీద ఆస్క్తి పెరిగింది. ఐతే నిఖిల్ ముందు డ్యాన్సర్ అవ్వాలని డ్యాన్స్ లో ప్రావీణ్యం సంపాదించాడు. ఐతే ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలని గ్రాడ్యుయేషన్ తర్వాత చిన్న జాబ్ లో జాయిన్ అయ్యారు. ఐతే అది సంతృప్తిని ఇవ్వకపోవడంతో సినిమాల్లో ప్రయత్నించారు. సినిమాల ఆడిషన్స్ టైం లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డానని నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో చెప్పారు. నువ్వు మాకు భారం అయ్యావని నిఖిల్ పేరెంట్స్ అతనితో అన్న సందర్భాలు ఉన్నాయని హౌస్ లో నిఖిల్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు.

నిఖిల్ కి మొదటిగా 2016 లో ఊటి అనే కన్నడ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ సినిమాతో పాటు కన్నడ సీరియల్స్ లో కూడా ఛాన్స్ వచ్చింది. అవి చేస్తున్న టైం లోనే స్టార్ మా నుంచి గోరింటాకు సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో దాని తర్వాత వరుస సీరియల్స్ ఆఫర్ వచ్చాయి. స్రవంతి, అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్స్ లో కూడా నిఖిల్ నటించి మెప్పించాడు.

స్టార్ మా సీరియల్స్ చేస్తున్న వారికి బిగ్ బాస్ ఎంట్రీ చాలా సులభం. అలా స్టార్ మా సీరియల్స్ ద్వారానే నిఖిల్ సీజన్ 8 లోకి అడుగు పెట్టాడు. ఐతే ముందు నుంచి తన ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపిస్తూ ఆడియన్స్ లో ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు నిఖిల్. ఐతే ఈ సీజన్ లో నిఖిల్ కు ముందు నుంచి సరైన పోటీ ఇచ్చే వాళ్లు లేరు. మధ్యలో వైల్డ్ కార్డ్ గా వచ్చి తర్వాత స్ట్రాంగ్ అయిన గౌతం ఫైనల్ వీక్స్ లో పోటాపోటీ అయ్యాడు. ఐతే మొదటి నుంచి కాన్ స్టంట్ గా టాస్కులు ఆడుతూ స్ట్రాంగ్ గా ప్రూవ్ చేసుకున్న నిఖిల్ కే ఆడియన్స్ ఓటు వేసి విజేతని చేశారు.

Tags:    

Similar News