బిగ్ బాస్ 8 : ఆ గ్రూప్ పై తేజ, గౌతం ఎటాక్..!

బిగ్ బాస్ 8 లో సీరియల్ బ్యాచ్ అది కూడా కన్నడ వారైన నిఖిల్, యష్మి, పృధ్వి మొదటి నుంచి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు.

Update: 2024-11-12 05:33 GMT

బిగ్ బాస్ 8 లో సీరియల్ బ్యాచ్ అది కూడా కన్నడ వారైన నిఖిల్, యష్మి, పృధ్వి మొదటి నుంచి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. వీరితోనే అప్పుడప్పుడు ప్రేరణ కూడా ఉంటూ వచ్చింది. అప్పుడప్పుడు ప్రేరణ ఆ గ్రూప్ దాటి బయటకు వచ్చి ఆట ఆడుతుంది. మరోపక్క విష్ణు ప్రియ కూడా అప్పుడప్పుడు ఆ గ్రూప్ లోనే అన్నట్టుగా ప్రవర్తిస్తుంది కానీ ఆమె పృధ్వి కోసమే ఆ గ్రూప్ తో క్లోజ్ గా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ లో కొందరు కలిసి ఆట ఆడతారు.. మరికొందరు మాత్రం ఇండివిడ్యువల్ గానే ఆట ఆడతారు.

ఎవరెలా ఆడినా సరే ఫైనల్ గా ఆడియన్స్ మనసు గెలిచిన వారే విన్నర్ గా నిలుస్తారు. ఐతే కొన్నిసార్లు గ్రూప్ గేమ్ ఆడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. హౌస్ లో గ్రూప్ గేమ్ ఆడటం తప్పేమి కాదు కానీ ఇక్కడ కన్నడ వాళ్లంతా కలిసి ఆడుతుంటే మాత్రం అది తప్పు అన్నట్టుగా మిగతా కంటెస్టెంట్స్ చెబుతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్స్ లో గౌతం, తేజ ఇద్దరు నిఖిల్, యష్మి, పృధ్వి లది గ్రూప్ గేమ్ అని చెప్పారు.

ప్రేరణ గౌతం ని నామినేట్ చేసి గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు సరిగా ఆడలేదని చెప్పింది. ఆ టైం లో ఆమెతో వాదించాడు గౌతం. ఆ తర్వాత గౌతం పృధ్విని నామినేట్ చేస్తూ తానెవరికి భయపడనని అన్నాడు. తేజ కూడా నిఖిల్ తో వాదిస్తున్న టైం లో మీ ముగ్గురు అనేసరికి పృధ్వి గొడవకి వచ్చాడు. యష్మిని తేజ నామినేట్ చేస్తున్న టైం లో కూడా తేజ ని వరస్ట్ ప్లేయర్ అన్నది. ఇలా కన్నడ గ్రూప్ అంతా కూడా తేజ, గౌతం మీద ఫైట్ కి దిగారు.

బిగ్ బాస్ హౌస్ లో అందరు సమానమే.. వాళ్లు కన్నడ వాళ్లైనా తెలుగు నేర్చుకుని హౌస్ లోకి వచ్చి ఇన్ని వారాలు సర్వైవ్ అవుతున్నారు. ఆట ప్రాతిపదికన ఎవరు ఏంటన్నది చూడాలే కానీ ఇలా కన్నడ వాళ్లు కాబట్టి వారిని తొక్కేయాలన్నది కరెక్ట్ కాదు. సోమవారం జరిగిన నామినేషన్స్ లో తేజ ఫైర్ అవ్వడం గౌతం డిఫెండ్ చేసుకున్న విధానం చూస్తే వారిద్దరి గ్రాఫ్ పైకి పెరిగిందని చెప్పొచ్చు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో స్ట్రాంగ్ అనుకున్న ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో ఎవరు ఈ వారం హౌస్ వదిలి వెళ్తారన్నది ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. తప్పకుండా ఈ వారం ఎలిమినేషన్ ఆడియన్స్ కు షాక్ ఇస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News