నేనింకా పీరియ‌డ్స్ అయింద‌నుకున్నా?

ఆ వెంట‌నే నీకు ఇంకా పీరియ‌డ్స్ రాలేదా? నేను ఇంకా వ‌చ్చాయ‌ను కున్నానే. మెడిక‌ల్ రూమ్ కి పిలిపించి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసారు.

Update: 2023-11-16 16:30 GMT

బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 17 దిగ్విజ‌యంగా ర‌న్నింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కంటెంస్టెంట్ల హంగామాతో షో మంచి ర‌న్నింగ్ లో ఉంది. గొడ‌వ‌లు..టాస్క్ లతో షో సాగిపో తుంది. ఈసారి బాలీవుడ్ జోడీ అంకితా లోఖండే-విక్కీ జైన్ కూడా పాల్గొన్నారు. ఇద్ద‌రు గేమ్ తో పాటు వ్య‌క్తిగ‌త విశేషాల‌తోనూ ర‌క్తిక‌ట్టిస్తున్నారు. తాజాగా భార్య‌-భ‌ర్త‌ల మ‌ధ్య‌న‌..నాలుగు గోడ‌ల మ‌ధ్య‌నే ఉండాల్సిన విష‌యాల్ని సైతం షో వేదిక‌గా ప‌బ్లిక్ చేసేసారు.


అంకిత లోఖండే మాట్లాడుతూ.. 'నాకెందుకో ఒంట్లో స‌రిగ్గా లేదు. పీరియ‌డ్స్ కూడా రాలేదు. ఇంటికె ళ్లాల‌న‌పిస్తుంద‌ని భ‌ర్త‌తో అంటుంది. ఆ వెంట‌నే నీకు ఇంకా పీరియ‌డ్స్ రాలేదా? నేను ఇంకా వ‌చ్చాయ‌ను కున్నానే. మెడిక‌ల్ రూమ్ కి పిలిపించి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసారు. ర‌క్త‌..మూత్ర‌ప‌రీక్ష‌లుచేసారు. ఇంకా రిజ‌ల్ట్ రాలేదు. అందుకే టెన్ష‌న్ గా ఉంది. నా బాధ మాట‌ల్లో చెప్ప‌లేను. ఏమీ అర్దం కావ‌డం లేదు.

ఒక‌వేళ పాజిటివ్ వ‌స్తే ప‌రిస్థితి ఏంటి? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఒక వేళ గ‌ర్భం దాల్చితే బిగ్ బాస్ సెట్ వాతావ ర‌ణంలో ఉండ‌టం క‌ష్ట‌మైన ప‌నే. అక్క‌డి వాతావ‌ర‌ణం...ప‌రిస్థితులు తీవ్ర ఒత్తిడికి గురిచేసే అవ‌కాశం ఉంటుంది. షో లో కొన‌సాగితే య‌ధావిధిగా టాస్క్ లు చేయాల్సి ఉంటుంది. ఇదంతా గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌తో సాధ్య‌మేనా? అన్న‌ది బిగ్ బాస్ ఆలోచించాల్సి ఉంటుంది.

అయితే భార్య‌భ‌ర్త‌ల మధ్య మాత్ర‌మే ఉండాల్సిన ఈ విష‌యాలు బిగ్ బాస్ ఇలా టెలికాస్ట్ చేయ‌డం భావ్యం కాద‌ని నెటి జ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. షో నిబంధ‌న‌లో ఇలాంటి రూల్స్ లేవా? భార్య‌భ‌ర్త‌ల‌కు స్వేచ్ఛ క‌ల్పించేలా కొన్ని ర‌కాల చ‌ర్య‌లు బిగ్ బాస్ తీసుకోవాల‌ని..ఇలాంటివి చ‌ర్చ‌కొచ్చిన‌ప్పుడు వాటిని రికార్డెడ్ గా ఉంచాలి త‌ప్ప‌! ఇలా ప‌బ్లిక్ చేయ‌కూడ‌ద‌ని మండిప‌డుతున్నారు.

Tags:    

Similar News