బిగ్ బాస్ సీజన్ 8… ఇది విన్నారా?
ఇదిలా ఉంటే ఈ సారి బిగ్ బాస్ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోయే కంటిస్టెంట్ లో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇండియాలో అతి పెద్ద రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ కి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో కూడా బిగ్ బాస్ ఇప్పటికి ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఎనిమిదో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున నే హోస్ట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అతని డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే వేరే అప్షన్ కి వెళ్తారు. మేగ్జిమమ్ నాగార్జున అయితే ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సీజన్ కోసం ఎప్పటిలాగే టీవీ, సినిమా సెలబ్రెటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్స్, మీడియాలో ఎక్కువగా హైలైట్ అయిన వారిని ఎంపిక చేయబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్స్ లో గత ఏడాది బిగ్ బాస్ షోకి ఎక్కువ ఆదరణ లభించింది. అలాగే మొదటి సారి కామన్ మెన్ గా హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు. దీని ద్వారా హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రేక్షకులని మెప్పిస్తే ఎవరైన విన్నర్ అవ్వొచ్చనే నమ్మకం చాలా మందికి వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సారి బిగ్ బాస్ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోయే కంటిస్టెంట్ లో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సెలబ్రెటీ ఆస్ట్రాలజర్ గా పాపులర్ అయిన వేణుస్వామి ఈ హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉందంట. అలాగే గత కొంతకాలంగా కాంట్రవర్సీలకి కేరాఫ్ గా మారిన జబర్దస్త్ కిరాక్ ఆర్ఫీ కన్ఫర్మ్ అయ్యారని టాక్. అలాగే సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్, పొలిటీషియన్ శిరీష అలియాస్ బర్రెలక్క హౌస్ లో వెళ్లబోతుందంట.
యుట్యూబ్ యాక్టర్ సోనియా సింగ్, అలాగే హీరోయిన్ గా రాణిస్తున్న ఖుషిత కల్లాపు, సోషల్ మీడియాలో పాపులర్ అయిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ కంటెస్టెంట్ లుగా ఉంటారని ప్రచారం నడుస్తోంది. సీరియల్ స్టార్స్ లో కూడా కొంతమందిని ఎంపిక చేయబోతున్నారంట. దాంతో పాటుగా మోడలింగ్, ఫ్యాషన్ రంగాలకి చెందిన వారు కూడా కంటిస్టెంట్ ల లిస్ట్ లో చేర్చబోతున్నట్లు సమాచారం.
అఫీషియల్ గా బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఎనౌన్స్ చేస్తే కంటిస్టెంట్ ల గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సారి బయటకి వినిపిస్తోన్న లిస్ట్ చూస్తుంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారినే ఎక్కువగా హౌస్ లోకి పంపించబోతున్నట్లు అర్ధమవుతోంది. అదే జరిగితే షో ఇంటరెస్టింగ్ గా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.