బిగ్ బాస్ 7 డేట్ లాక్.. అనౌన్స్ మెంట్ లేటెందుకు..?

హోస్ట్ నాగార్జున తో ప్రోమోలు వదులుతూ ఆడియన్స్ లో ఈ సీజన్ పై ఆసక్తి పెంచేలా చేస్తున్నారు బిగ్ బాస్ టీం

Update: 2023-08-15 14:30 GMT

బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో మొదలవుతుంది. హోస్ట్ నాగార్జున తో ప్రోమోలు వదులుతూ ఆడియన్స్ లో ఈ సీజన్ పై ఆసక్తి పెంచేలా చేస్తున్నారు బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ తెలుగు ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక ఓటీటీ సీజన్ అదే బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా నిర్వహించారు. ఆరు సీజన్లలో ఆరో సీజన్ అంటే లాస్ట్ సీజన్ బిగ్ బాస్ పై ఆడియన్స్ నిరాశ చెందారు. అందుకే బిగ్ బాస్ టీం ఈసారి అలా జరగకూడదని సరికొత్త ప్లానింగ్ తో వస్తుంది. ఇప్పటికే నాగార్జున ప్రోమోలతో ఈ సీజన్ ఆడియన్స్ అనుకున్న అంచనాలకు భిన్నంగా ఉంటుందని ఊరిస్తున్నారు.

దానికి తగినట్టుగానే ప్రోమోస్ కూడా ఉంటున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3 నుంచి మొదలవుతుందని టాక్. ఆల్రెడీ డేట్ లాక్ చేశారు కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం చేయట్లేదు. దీని వెనుక రీజన్ బిగ్ బాస్ తెలుగుపై కేసులు గట్రా వేయడమే అని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఈ రియాలిటీ గేమ్ పై నిషేధం విధించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదొక గేమ్ షోలానే చూడాలి తప్ప మరో విధంగా కాదని.. రియాలిటీ షో రైట్స్ లోబడే ఈ షో నడుస్తుందని బిగ్ బాస్ టీం చెబుతున్నారు.

సో ఈ గొడవల వల్లే సెప్టెంబర్ 3 నుంచి ఒకవేళ షో మొదలు పెట్టే అవకాశం లేకపోతే మరో వారం రెండు వారాలు ఆగి ఈ సీజన్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. అసలైతే మరో వారం లోనే ఈ సీజన్ కు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ని హోటెల్ లో ఉంచుతారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3న మొదలవుతుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. హోస్ట్ గా ఈ సీజన్ కూడా నాగార్జునే చేస్తుండటం విశేషం. అటు సినిమాలు ఇటు టీవీ షో హోస్టింగ్ రెండిటిలో నాగార్జున తన సత్తా చాటుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్స్ విషయంలో కూడా బిగ్ బాస్ టీం చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సీజన్ క్రేజీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తారని టాక్. సినీ నటులు, సీరియల్ యాక్టర్స్ తో పాటుగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు కూడా సీజన్ 7 లో ఉంటారని తెలుస్తుంది. బిగ్ బాస్ 7 ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న టీం ఎలాంటి టాస్క్ లతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News