ఫోటో స్టోరి : వావ్! బిల్ గేట్స్ ఎంత సింప్లిసిటీ!!

అయితే ఒక బిలియ‌నీర్ ఇదిగో ఇలా సింపుల్ గా క‌నిపిస్తే అది వీక్ష‌కుల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేయ‌కుండా ఉంటుందా?

Update: 2024-07-30 16:34 GMT

డ‌బ్బు సంపాదించ‌డం ఒకెత్తు అయితే ధాన‌ధ‌ర్మాలు చేయ‌డం మ‌రొక ఎత్తు. ప్ర‌జ‌ల జీవితాల్లో నిరంత‌రం మార్పు కోరుకోవ‌డం గొప్ప వ్య‌క్తుల‌కు మాత్ర‌మే సాధ్యం. అలాంటి ఒక గొప్ప ఆలోచ‌న‌లు ఉన్న వ్య‌క్తిత్వం బిల్ గేట్స్. బిలియ‌న్ల డాల‌ర్లు సంపాదించినా కానీ ఆయ‌న ధాన‌ధ‌ర్మాల‌తోను గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే ఒక బిలియ‌నీర్ ఇదిగో ఇలా సింపుల్ గా క‌నిపిస్తే అది వీక్ష‌కుల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేయ‌కుండా ఉంటుందా?


తాజాగా గేట్స్ త్రోబ్యాక్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. సియాటిల్‌లోని డిక్స్ డ్రైవ్-ఇన్‌లో బిల్ గేట్స్ వేచి ఉన్న‌ప్ప‌టి ఫోటోగ్రాఫ్ ఇది. ఈ ఫోటో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరైనప్పటికీ గేట్స్ తన సాధారణ అభిరుచులను ఎప్పుడూ వ‌దులుకోలేదు. ఆయ‌న బ‌ర్గ‌ర్ కొనుక్కునేందుకు క్యూలో ఒంటరిగా నిలబడి కనిపించారు. వారాంతంలో బెల్లేవ్‌లోని బర్గర్ మాస్టర్‌లో బర్గర్‌ని ఆస్వాధించడానికి ఆయ‌న ఇంత సింపుల్ గా వ‌చ్చేశారు. లైన్ లో నిలుచుని ఉన్నారు. డిక్స్ డ్రైవ్-ఇన్ వ‌ద్ద ఇలా వేచి చూసారు. ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ వ‌ద్ద‌ నియాన్ లైట్ల కాంతిలో ఒక సాధార‌ణ యువ‌కుడిలా మాత్ర‌మే ఆయ‌న క‌నిపించారు ఆ స‌మ‌యంలో. త‌న‌ జేబులో చేతులు ఉంచి ఏదో ఆలోచిస్తూనే క‌నిపించారు అక్క‌డ కూడా. పాల్ రిచ్ తీసిన ఈ ఫోటో సీటెల్ కి చెందిన వాలింగ్‌ఫోర్డ్ పరిసరాల్లోని ఈశాన్యంలో 45వ వీధిలోని డిక్ ప్రదేశంలో 2019 నాటిది.

బిల్ గేట్స్ గతంలో సంపద గురించి సింప్లిసిటీ గురించి తన ఆలోచనలను షేర్ చేసారు. 2011లో యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో త‌న‌ ప్రసంగంలో ``బిలియనీర్‌గా ఉండటాన్ని అతిగా అంచనా వేయవచ్చని.. తాను చాలా సింపుల్ గా బ‌ర్గ‌ర్‌ల‌ను తీసుకురావ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌``ని పేర్కొన్నాడు. ``మిలియన్ల డాలర్లు కావాలని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక నిర్దిష్ట స్వేచ్ఛ, అర్థవంతమైన స్వేచ్ఛ సాధార‌ణ జీవ‌నంతోనే వ‌స్తుంది`` అని గేట్స్ చెప్పారు. అవ‌స‌రాన్ని మించి సంప‌ద‌లు వ‌చ్చినా కానీ దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో గేట్స్ వివ‌రించారు. ఈ ఫోటో చూడ‌గానే గేట్స్ డౌన్-టు ఎర్త్ వ్యక్తిత్వం అర్థ‌మ‌వుతోంది. జీవితంలోని సాధారణ సంతోషాల అవ‌స‌రాన్ని ఆయ‌న జీవ‌న‌శైలి వెల్ల‌డించింది. అపారమైన సంపద ఉన్నా కానీ... స్థానిక డ్రైవ్-ఇన్‌లో బర్గర్‌ను ఆస్వాధించడం వంటి సాధాసీధా వ్యాప‌కం ఆయ‌న‌కు ఎంతో ఆనందాన్నిచ్చింది. దీని నుంచి ధ‌నార్జ‌నే ధ్యేయంగా జీవింఏ ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా ఎంతో కొంత పాఠం నేర్చుకుని తీరాలి.

Tags:    

Similar News