ఒంటరిగా ఉన్న హీరోయిన్ పై అత్యాచారం.. బ్లాక్ మెయిల్!
ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొందని తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో హత్యాచారం చేయడం.. ఆ దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించడం.. అనంతరం బ్లాక్ మెయిల్ కు పాల్పడటం.. ఆ బ్లాక్ మెయిల్ లో వరుస హత్యాచారాలు, ఆర్ధికపరమైన కొరికలు బయట పెట్టడం జరుగుతూ ఉన్న సంఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే.
కొందరు కామాంధులు పసిపిల్లల మొదలు ముసలి వాళ్ళ వరకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని.. మరికొందరైతే ప్రేమ ముసుగులో యువతులను శారీరకంగా లోబరుచుకుంటున్నారని నిత్యం ఏదో ఒక మూల కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొందని తెలుస్తుంది.
అవును... బెంగాళ్ కు చెందిన ఒక యువనటి ఇలాంటి పరిస్థితే ఎదుర్కొందని తెలుస్తుంది. అయితే ఆమె ఇంట్లోనే పరిచయం ఉన్న వ్యక్తే ఈ పాడు పనికి పాల్పడ్డాడట. ఆ వీడియోలు పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తూ డబ్బులు గుంజుకుంటున్నాడని తెలిసింది. వీటికి సంబంధించి కీలక విషయాలు ఆమె వెళ్లడించిందని అంటున్నారు.
ఈ బెంగాళీ యువనటిని ఇంట్లోనే ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడట. జులై 5న జరిగిన ఘటనను ఆ వ్యక్తి రహస్యంగా సెల్ ఫోన్ లో చిత్రీకరించాడంట. అనంతరం ఆ వీడియో చూపిస్తూ ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడని అంటున్నారు.
తొలుత డబ్బులు అప్పు కావాలంటూ ఆమె ఇంటికి వెళ్లిన సదరు కామాంధుడు.. ఆమె ఒంటరిగా నివసిస్తుందన్న విషయం తెలుసుకొని ఆమెపై బలత్కారానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. ఈ విషయం బయటపెడితే ఆ వీడియోను పోర్న్ సైట్లో అప్లోడ్ చేస్తానని ఆమెను బెదిరించాడట.
అయితే ఈ నేపథ్యంలో మొదట్లో విపరీతంగా బయపడిపోయిందంట సదరు హీరోయిన్. అనంతరం ధైర్యం తెచ్చుకుని పోలీసులుకు ఫిర్యాదు చేసిందంట. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కేసు విచారణ మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆమెను వైద్య పరీక్షలకు పంపారని తెలుస్తుంది.