అది మాత్రం బోర్ కొట్టేసిందన్న ప్రభాస్..!
ప్రభాస్ ప్రాజెక్ట్ కె గ్లింప్స్ అదిరిపోయాయి
ప్రభాస్ ప్రాజెక్ట్ కె గ్లింప్స్ అదిరిపోయాయి. మొదట ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి చాలా మంది విమర్శించారు. చీప్ ఎడిటింగ్, ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని కొందరు, మరో ఆదిపురుష్ అవ్వడం ఖాయమంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ, ఒక్కసారి గ్లింప్స్ రిలీజ్ చేసి, అందరి నోళ్లు మూయించారు. ట్రోల్స్ అన్నీ పక్కకుపోయి, ప్రతి ఒక్కరూ వావ్ అనేస్తున్నారు..
అమెరికాలో 'శాన్ డియాగో కామిక్ కాన్' ఈ వెంట్ కి ప్రాజెక్ట్ కె టీమ్ హాజరైంది. ఈ కార్యక్రమంలోనే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ ప్రకారం, టైం ట్రావెల్ కథ అని అర్థం అవుతోంది. ఇందులో ఏకంగా 2898వ సంవత్సరానికి వెళ్లేట్టు కనిపిస్తోంది. ఇందులో ప్రభాస్ కల్కి అవతారంలో ప్రపంచాన్ని కాపాడే దేవుడిలా కనిపించబోతోన్నాడు అనే విషయం అర్థమౌతోంది.
కాగా, ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, కమల్ హాసన్ వంటివారు హాజరుఅయ్యారు. ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడారు. మూవీ షూటింగ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
బాహుబలి, ఆదిపురుష్, సాహో, సాలార్, కల్కి 2898 AD వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు కదా ఇందులో రియల్ సెట్స్ కంటే బ్లూ స్క్రీన్ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా బ్లూ స్క్రీన్ పట్ల బోర్ కొట్టిందా? అంటూ ఓ విలేఖరి ప్రభాస్ ని ప్రశ్నించారు.
అయితే దానికి ప్రభాస్ సరదాగా సమాధానం చెప్పారు. మొదట్లో షూటింగ్ సమమయంలో బోర్ కొట్టిందని, ఆ బ్లూ స్క్రీన్ ముందు, తాను చిన్నగా కనిపిస్తున్నానని ఆయన చెప్పడం విశేషం. కానీ, గ్లింప్స్ చూశాక మాత్రం చాలా బాగుంది అంటూ ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమానికి ప్రభాస్ తో పాటు హీరోయిన్ దీపికా కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రాలేకపోయారు. ఇక, అమితాబచ్చన్ మాత్రం డైరెక్ట్ గా రాలేకపోయినా, ఆన్ లైన్ ద్వారా హాజరవ్వడం విశేషం.