వీర‌మ‌ల్లులో విల‌న్ ఎలా ఉంటాడంటే?

ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో వీర‌మ‌ల్లులో కూడా ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్లు రివీల్ చేసాడు.

Update: 2025-01-17 04:58 GMT

బాలీవుడ్ న‌టుడు బాబి డియోల్ పుల్ స్వింగ్ లో కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. `యానిమ‌ల్` విజ‌యంతో ఒక్క‌సారిగా మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చేసాడు. సెకెండ్ ఇన్నింగ్స్ అత‌డు ఏమాత్రం ఊహించ‌ని విధంగా దూసుకుపోతుంది. ప‌ట్టింద‌ల్లా బంగారమే అవువుతుంది. అగ్ర హీరోల అన్ని చిత్రాల్లో తానే విల‌న్ అవుత‌న్నాడు. ముఖ్యంగా సౌత్ సినిమాలు బాబికి బాగా క‌లిసొచ్చిన చిత్రాలుగా మారాయి. ప్ర‌స్తుతం బాబి లైన‌ప్ లో మూడు నాలుగు, ద‌క్షిణాది చిత్రాలున్నాయి.

ఇటీవ‌లే `డాకు మ‌హారాజ్` లో విల‌న్ పాత్ర‌తో మ‌రోసారి మెప్పించాడు. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన` డాకు మ‌హారాజ్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. అంత‌కు ముందు `యానిమ‌ల్` తోనే తెలుగు ఆడియ‌న్స్ కు బాగా రీచ్ అయ్యాడు. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ పవ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న పిరియాడిక్ చిత్రం `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` లోనూ బాబి డియోల్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో అత‌డి పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది ఇంత వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు.

ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో వీర‌మ‌ల్లులో కూడా ప్ర‌తినాయ‌కుడి పాత్ర పోషిస్తున్న‌ట్లు రివీల్ చేసాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెట‌ప్ ఆధారంగా చూస్తే వీర‌మ‌ల్లులో బాబి లుక్ కూడా అందుకు ధీటుగా ఉంటుంది. పాత్ర కూడా అంతే బ‌లంగా ఉంటుంద‌ని చెప్పొచ్చు. పీరియాడిక్ స్టోరీ నేప‌థ్యంలో ప్ర‌తి పాత్ర శ‌క్తివంతంగానే క‌నిపిస్తుంది. అందు లోనూ బాబి డియోల్ లాంటి న‌టుడిని పెట్టుకున్నారంటే? ఆ పాత్ర మ‌రింత ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంద‌ని చెప్పొచ్చు.

అలాగే బాబి డియోల్ మ‌రో విష‌యం కూడా లీక్ చేసాడు. `హరిహర వీరమల్లు స్క్రిప్ట్ చాలా యూనిక్ గా ఉంటుందన్నారు. ఇలాంటి క‌థ‌లు చాలా అరుదుగా వ‌స్తాయ‌ని ఈ క‌థ పాస్ట్ లైప్ పాత్ర‌లు కూడా చాలా బ‌లంగా తెర‌పై క‌నిపిస్తాయ‌న్నారు. ఫ‌స్ట్ సిట్టింగ్ లోనే స్టోరీ ఒకే చేసిన‌ట్లు` తెలిపారు. బాబి వ్యాఖ్య‌లు వీర‌మ‌ల్లుకు మ‌రింత బూస్టింగ్ లా మారాయి. ఈ చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News