గాయంతో మాస్ రాజా.. ఎలా ఉన్నాడంటే..

దీంతో షూటింగ్ వాయిదా వేశారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న రవితేజ ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

Update: 2024-09-12 13:59 GMT

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం భాను భోగావరపు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో రవితేజ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం మరీ అంత తీవ్రమైంది కాకపోయిన నాలుగు నుంచి ఆరు వారాల పాటు కచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారంట. దీంతో షూటింగ్ వాయిదా వేశారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న రవితేజ ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.


ఇదిలా ఉంటే బాబీ దర్శకుడిగా రవితేజ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది. ఈ సందర్భంగా బాబీ మాస్ మహారాజ్ రవితేజని కలిశారు. ఆయనతో హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రవితేజతో దిగిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రవితేజ చేతిని కట్టుతో కవర్ చేసుకొని ఉన్నారు.

ఫోటో చూస్తుంటే చేతికి బలమైన గాయం అయినట్లు అర్ధమవుతోంది. గాయం అయిన తర్వాత రవితేజ మీడియాకి కనిపించడం ఇదే ఫస్ట్ టైం. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోకి తీవ్రంగా గాయాలయ్యాయని టెన్షన్ పడ్డారు. అయితే తాజాగా బయటకొచ్చిన ఫోటో చూసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యారు. అన్నయ్య కొద్దిగా రెస్ట్ తీసుకోండి అంటూ ట్విట్టర్ లో ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న న్యూ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధం అవుతోంది. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీల ఈ చిత్రంలో రవితేజతో జతకట్టింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

RT75 చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే షూటింగ్ వాయిదా పడటంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రవితేజ ఈ ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో వచ్చిన ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్ భారీ నష్టాలు తీసుకురావడంతో రవితేజ తన రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి తిరిగి ఇచ్చేశారనే ప్రచారం నడుస్తోంది.

Tags:    

Similar News