వీడియో: బ్లాక్‌లో జాక్విలిన్ స్టన్నింగ్ లుక్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎనర్జీ వ్యక్తిత్వం సోషల్ మీడియా వేదికలపై లక్షలాదిగా అభిమానులతో ఇంటర్నెట్ సంచలనంగా ఎదగడానికి సహకరించింది.;

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎనర్జీ వ్యక్తిత్వం సోషల్ మీడియా వేదికలపై లక్షలాదిగా అభిమానులతో ఇంటర్నెట్ సంచలనంగా ఎదగడానికి సహకరించింది. ఇటీవల జాకీ ప్రపంచంలోనే అతిపెద్ద యూట్యూబర్ మిస్టర్ బీస్ట్‌తో కలిసి ఒక ప్రచారం కోసం పనిచేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి మరింత పెరిగింది. మిస్టర్ బీస్ట్ భారతదేశంలో తన మొదటి టూర్ కోసం జాక్వెలిన్‌ను ఎంచుకున్నాడు. జాకీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావవంతమైనదో చూసి తన దాతృత్వ ప్రచారం కోసం సహకారం కోరాడు. ఆమె నటనతో పాటు, జాక్వెలిన్ మ్యూజిక్ వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా గొప్ప పాపులారిటీ సంపాదించింది. ధాతృత్వంలో జాక్విలిన్ గొప్పతనానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు, ప్రశంసలు దక్కుతున్నాయి.

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ నిరంతర ఫోటోషూట్లకు భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా పాపులర్ జీ సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో మతి చెడే బ్లాక్ డ్రెస్ లో ప్రత్యక్షమైంది. ఇది హాఫ్ షోల్డర్ డిజైనర్ గౌన్. భారీతనం నిండిన ఈ దుస్తుల్లో జాక్విలిన్ తన అందాలను ప్రదర్శిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చిన వీడియో ఇప్పుడు అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. అందమైన నవ్వు.. టోన్డ్ బాడీతో జాక్విలిన్ ఫోటోషూట్ ఆద్యంతం ఆకర్షించింది.
జాకీ తదుపరి పలు భారీ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో హౌస్‌ఫుల్ 5 , వెల్‌కమ్ టు ది జంగిల్‌లో కనిపిస్తుంది. మల్టీ స్టారర్ ఫ్రాంచైజ్ చిత్రాలు రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ రెండింటికి ముందు ఫతేలో సోను సూద్‌తో కలిసి కనిపించింది. కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.