షిఫాన్ గౌనులో బెబో IT గర్ల్ వైబ్స్

స్టైల్ అన్న ప‌దానికి నిర్వ‌చ‌నం బెబో. బాలీవుడ్ కి జీరో సైజ్ ని ప‌రిచ‌యం చేసిన మేటి క‌థానాయిక‌ కరీనా కపూర్ ఖాన్ ఎంపిక‌లు అన్నివేళ‌లా యువ‌త‌రంలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి.

Update: 2024-12-09 00:00 GMT

స్టైల్ అన్న ప‌దానికి నిర్వ‌చ‌నం బెబో. బాలీవుడ్ కి జీరో సైజ్ ని ప‌రిచ‌యం చేసిన మేటి క‌థానాయిక‌ కరీనా కపూర్ ఖాన్ ఎంపిక‌లు అన్నివేళ‌లా యువ‌త‌రంలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. ఇటీవ‌లే క్రూ చిత్రంలో బెబో బోల్డ్ అవ‌తార్ చూసి యూత్ స్ట‌న్న‌యిపోయారు. కొంటె ఎయిర్ హోస్టెస్ పాత్ర‌లో క‌రీనా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.


నేటి జెన్ జ‌డ్ తార‌ల‌తో పోటీప‌డుతూ.. క‌రీనా స్టైల్ బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూనే ఉంది.. తాజాగా తన వార్డ్‌రోబ్ సెల‌క్ష‌న్ IT గర్ల్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండో రోజు అద్భుత‌మైన లుక్ తో షో స్టాప‌ర్ గా నిలిచింది. ఫెస్టివల్ లో బెబో వైబ్స్ షో స్టాప‌ర్ గా నిలిచాయి. క్రీమ్ షిఫాన్ గౌనులో బెబో మాయ చేసింది. క‌మాండింగ్ గ‌ర్ల్ కరీనా సామర్థ్యానికి ఈ లుక్ నిదర్శనంగా నిలిచింది.


క్రిస్టినా ఫిడెల్స్‌కాయా రూపొందించిన ఫ్లోటింగ్ షిఫాన్ గౌను క‌టింగ్ షేప్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఫుల్ స్లీవ్‌లు లాంగ్ నెక్ ..ఎడ్జీ బస్ట్ కటౌట్ ... నెక్‌లైన్ ఇవ‌న్నీ క‌రీనా లుక్ ని స్పైస‌ప్ చేసాయి. క‌రీనా పవర్ డ్రెస్సింగ్ స్టైల్.. రెడ్ సీ ఫిలిం ఫెస్టివల్ లో ఒక స్టైల్ ఐకాన్ హోదాను మరింత సుస్థిరం చేసాయి.. రాజరికపు రూపం.. అధునాతన స్టైల్ ని మిళితం చేస్తూ ఒక మాస్టర్ క్లాస్ లుక్ త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని క‌రీనా నిరూపించింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. క‌రీనా క‌పూర్ ఖాన్ త‌దుప‌రి చిత్రం గురించి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News