ఫోటో స్టోరి: మ‌లైకా వెండి త‌ళుకులు

యువ‌హీరో అర్జున్ క‌పూర్ నుంచి విడిపోయిన మ‌లైకా అరోరా ఇటీవ‌ల‌ ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతోంది.

Update: 2024-12-15 12:52 GMT

యువ‌హీరో అర్జున్ క‌పూర్ నుంచి విడిపోయిన మ‌లైకా అరోరా ఇటీవ‌ల‌ ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతోంది. ఇలాంటి స‌మయంలో మ‌లైకా ఫ‌లానా యువ‌కుడితో ఎఫైర్ సాగిస్తోందంటూ బాలీవుడ్ మీడియా చిలువ‌లు ప‌లువలుగా ప్ర‌చారం చేస్తోంది. త‌న‌పై నిరంత‌ర ప్ర‌చారానికి తాను చాలా కుంగిపోతాన‌ని అంగీక‌రించిన మ‌లైకా, ఇటీవ‌ల అన్నిటికీ అల‌వాటు ప‌డిపోయిన‌ట్టు తెలిపింది.


త‌న‌పై మీడియా ప్ర‌చారాన్ని పట్టించుకునేంత‌ స‌మ‌యం కూడా లేనంత‌గా బిజీ అయిపోయాన‌ని మ‌లైకా వెల్ల‌డించింది. ముఖ్యంగా ఈ భామ‌ సోష‌ల్ మీడియా క్వీన్‌గా నిరంత‌రం బిజీగా ఉంది. ఈ వేదిక‌పై వ‌రుస‌ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అగ్గి రాజేస్తోంది. తాజాగా మ‌లైకా యోగాభ్యాసం చేస్తున్న‌ప్ప‌టి ఫోటోగ్రాప్స్ అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. ఈ ప్రాక్టీస్ సెష‌న్ కోసం మ‌లైకా సిల్వ‌ర్ క‌ల‌ర్ టూపీస్ ని ధ‌రించింది. చిక్ సిల్వర్ కో-ఆర్డ్ సెట్‌తో మ‌లైకా తన రూపాన్ని ఎలివేట్ చేసింది. టోన్డ్ బాడీ.. ఫిట్‌టింగ్ క్రాప్‌టాప్ మ్యాచింగ్ షార్ట్ తో ప్ర‌త్యేకంగా క‌నిపించింది ఈ బ్యూటీ. ఈ లుక్ చూశాక‌.. మ‌లైకా టోన్డ్ బాడీని సిల్వ‌ర్ త‌ళుకులు ఎంతో అందంగా ఎలివేట్ చేసాయంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. మ‌లైకా కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంద‌ని కూడా ప్ర‌శంసిస్తున్నారు.


ఇటీవలి ఇన్‌స్టా పోస్ట్‌లో `షైన్ బేబీ షైన్…` అనే క్యాప్షన్‌తో మలైకా అరోరా వరుస యోగా భంగిమలను ప్ర‌ద‌ర్శించింది. ఫిట్‌నెస్ అభిమానులను ఈ కొత్త రూపం ఎగ్జ‌యిట్ చేసింది. మలైకా త‌న ఇంటి పరిస‌రాల్లోని బాల్కనీలో ప్రశాంతమైన భంగిమలతో యోగా ప్రాక్టీస్ చేసింది. మెదడు ఆరోగ్యం సహా సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక శక్తివంతమైన యోగా భంగిమలను ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది మ‌లైకా. ఆంజనేయసనం (తక్కువ లంజ్ భంగిమ), ఉస్త్రాసన (ఒంటె భంగిమ) వంటి భంగిమలతో క‌నిపించింది.


Tags:    

Similar News