ఆ బ్యూటీకి పడుకునే మంచమే సూపర్ మోడల్!
బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికిందర్ ఇన్ న్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం డిజైనర్ దుస్తుల్లో శామా సెగలు నెట్టింట చర్చకొస్తుంటాయి. ఎలివేషన్ లో తనదైన మార్క్ తప్పనిసరి ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. హీటెక్కించే ఘాటు ఫోజులతో కుర్రకారుని అలరించడం అమ్మడి ప్రత్యేకత. డిజైనర్ దుస్తులేసినా.. సంప్రదాయ దుస్తులైనా షామా అందానికి కుర్రాళ్లంతా ఫిదా అవ్వాల్సిందే. మార్కెట్ లో పోటీని తట్టుకుని నిలవాలంటే? ఆ మాత్రం తప్పదంటూ ముందుకు సాగిపోతుంది.
తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటో షూట్ తో నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా బెడ్ పై ఫోటో షూట్ లో పాల్గొంది. బ్లాక్ కలర్ ప్యాంట్..బ్లౌజు ధరించి స్కిన్ షోతో చెలరేగింది. అమ్మడి హెయిర్ స్టైల్..మ్యాకప్ తో చూపరు లను ఆకర్షిస్తుంది. షామా కళ్లలో ఆ మత్తును గమనించొచ్చు. వేకువ జామునే లేచిన బ్యూటీలా ఫోకస్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోకి అమ్మడు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. మీ మంచం మీకు సూపర్ మోడల్ లా అనిపించి నప్పుడు అంటూ రాసుకొచ్చింది.
అంటే షామా సింకదర్ రోజూ పడుకునే మంచం తనకు సూపర్ మోడల్ లా అనిపిస్తుందన్న మాట. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైలర్ అవుతున్నాయి. షామా బ్యూటీకి అమ్మడి అభిమానులు యధావిధిగా ఫిదా అవుతున్నారు.
అందాన్ని ఆస్వాదించే వారికి షామా లెక్కలన్నీ పర్పెక్ట్ గా తెలుసు. నిత్యం సోషల్ మీడియాని అంటి పెట్టుకుని ఉంటుంది. వెకేషన్ ఫోటోలు....ఫోటో షూట్లు అంటూ జనాల్ని గ్యాప్ లేకుండా ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటుంది.
ఇక షామా కెరీర్ సంగతి చూస్తే ప్రేమ్ అగాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మన్ ..ది డెడ్లీ పార్ట్.. బస్తీ..దూమ్ ధడాకా..కాంట్రాక్ట్ ..సెక్సాహోలిక్ లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన బైపాస్ రోడ్ రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.