ఒంపు సొంపుల్ని రంగరిస్తున్న సుహానా
కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ బాలీవుడ్ లో బిగ్ డ్రీమ్స్ తో అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ బాలీవుడ్ లో బిగ్ డ్రీమ్స్ తో అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. జోయా `ది ఆర్చీస్` వెబ్ సిరీస్ తో తెరకు పరిచయమైన సుహానా తదుపరి సుజోయ్ ఘోష్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పాపా షారూఖ్ తో కలిసి నటిస్తోంది.
అయితే సుహానా ఖాన్ నటనలో ప్రవేశిస్తోంది అనగానే, ఆరంభం చాలా విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు తన రూపాన్ని విమర్శించారు. బ్రౌనీ అంటూ తన ఛాయ గురించి కామెంట్లు చేసారు. జూనియర్ షారూఖ్ లా ఉందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. అయితే వీటన్నిటికీ సుహానా తనదైన శైలిలో సమాధానం చెబుతోంది.
మునుపటితో పోలిస్తే ఈ కుర్రబ్యూటీ వన్నె చిన్నెలు వయ్యారాల వడ్డనలు ఇప్పుడు బ్రిలియంట్‌గా ఆకర్షిస్తున్నాయి. సుహానా ఒంపు సొంపుల వయ్యారాల వడ్డనలకు యువతరం ఫిదా అయిపోతున్నారు. అంతకంతకు సుహానాలో గ్లామ్ యాంగిల్ బయటపడుతుంటే కళ్లప్పగించేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలో తోటి నటవారసురాళ్లతో పోటీపడుతూ సుహానా తన అందచందాలను ఎలివేట్ చేసే రివీలింగ్ దుస్తుల్లో కనిపిస్తోంది.
తాజాగా దీపావళి పండుగలో సుహానా లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డిజైనర్ ద్వయం ఫల్గుణి షేన్ పీకాక్ షెల్ఫ్‌ల నుండి స్టిచ్డ్ చీర(స్కర్ట్)లో సుహానా ఖాన్ ఆకర్షణీయంగా కనిపించింది. జెన్ Z బ్యూటి బ్లుష్ కలర్ సీ-త్రూ మెష్ ఫాబ్రిక్‌తో తయారు చేసిన తొమ్మిది గజాల వండర్ స్కర్ట్‌లో దీపావళికి లైట్ వైబ్‌లను జోడించింది. ఈ అందమైన చీర కం స్కర్ట్ లుక్ ప్రత్యేకంగా కనిపిస్తోది. ఇది పల్లా బంగారు దారాల మధ్య సెట్ చేసిన పూల పూసల వరుసతో అద్భుతంగా కనిపిస్తోంది. సుహానా బంగారు కుందన్ వర్క్ చంద్‌బాలీ చెవిపోగులు..మణికట్టును అలంకరించే కుందన్ బ్రాస్‌లెట్‌తో పండుగ రూపాన్ని అందంగా ఆవిష్కరించింది. దీపావళి రూపానికి దేశీ గ్లామ్ స్పర్శను జోడించడానికి న్యూడ్ పెదవి రంగు మెరిసే మినీ బిందీని ఎంపిక చేసుకుంది. ఫోటోషూట్ కోసం సుహానా క్యాలిక్యులేటెడ్ ఎక్స్ ప్రెషన్స్ తో మైమరిపించింది.