బాలీవుడ్ హీరోలు కూడా జనాల్లోకి వెళ్తారా?
ఇలా చేయడంతో ఖాన్ లు..కపూర్ ల తొలి రోజు వసూళ్ల రికార్డులన్నీ చెరిగి పోయాయి. భారీ ఎత్తున పుష్ప-2` కి ఓపెనింగ్స్ రావడంతోనే అది సాధ్యమైంది.
`పుష్ప-2 `మేకర్స్ పాట్నాలో నిర్వహించిన ఈవెంట్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరాదిన ఇలా పబ్లిక్ లో ఓ సినిమా ఈవెంట్ నిర్వహించడం అన్నది అదే తొలిసారి. సాధారణంగా ఇలాంటి ఈవెంట్లు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటాయి. కానీ బన్నీ ఉత్తరాదిన కనెక్ట్ అయ్యేందుకు తెలివిగా జనాల్లోకి వెళ్లి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. ఇలా చేయడంతో ఖాన్ లు..కపూర్ ల తొలి రోజు వసూళ్ల రికార్డులన్నీ చెరిగి పోయాయి. భారీ ఎత్తున పుష్ప-2` కి ఓపెనింగ్స్ రావడంతోనే అది సాధ్యమైంది. ఒక్క హిందీలోనే సినిమా 600 కోట్ల వసూళ్లను సాధించింది.
దీంతో బాలీవుడ్ హీరోలకు ఈ వసూళ్లు ఎలా అన్నది ఏమాత్రం మింగుడు పడలేదు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన తెలుగు హీరోని మన జనాలు ఇలా ఆదరించడం ఏంటి? అనే అంతర్మధనం మొదలైంది. మరి ఈ అంతర్మధనం బాలీవుడ్ హీరోల్లో ఎలాంటి మార్పును తీసుకొస్తుంది అంటే భారీ మార్పు దిశగానే సన్నివేశం కనిపిస్తుంది. సాధారణంగా బాలీవుడ్ ఇలా ఓపెన్ గా సినిమా ఈవెంట్లు నిర్వహించే కల్చర్ అక్కడ లేదు.
సినిమా రిలీజ్ సమయంలో సింపుల్ గా ఓ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసేస్తారు. మీడియాతో చిన్న పాటి ఇంటరాక్షన్ ఉంటుంది. కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లోనూ చిన్నగా ప్రమోట్ చేస్తారు. అదీ కేవలం నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చూసుకుంటారు. అలాగే టీవీ ఛానల్స్ షో స్ ద్వారానూ సినిమాను ప్రమోట్ చేసుకుంటారు. అలాంటి రిలీజ్ కే భారీ ఎత్తున ఓపెనింగ్స్ వచ్చేస్తుంటాయి అక్కడ. ఇది ఎంతో కాలంగా కొనసాగుతున్న విధానం ఇది. అయితే `పుష్ప-2` దెబ్బకి ఈ విధానమంతా మారేలా కనిపిస్తుంది.
బాలీవుడ్ హీరోలు కూడా తెలుగు సినిమా ఈవెంట్లలా అక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారుట. మరీ భారీ ఎత్తున ఓపెన్ గ్రౌండ్ లో నిర్వహించకపోయినా కనీసం ఓ పెద్ద స్టార్ హోటల్ లో పరిమి తంగా అభిమానుల్ని, మీడియాను ఆహ్వానించి వాళ్లతో ఇంటరాక్ట్ అయితే కలిసొస్తుందని భావిస్తున్నారుట. అలాగే టీవీ షోలు తగ్గించి సాధారణ ప్రేక్షకుడికి సినిమా కనెక్ట్ అయ్యే కొత్త పాలసీని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ హీరోల్లో బన్నీ భారీ మార్పే తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది.