సుకుమార్ వెంట బాలీవుడ్ హీరోలా?
ఇక్కడ హీరోలు, నిర్మాతలతోనే సినిమాలు చేస్తున్నారు. అలాగే ప్రభాస్ తోనూ బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ లు తమ బ్యానర్లో అవకాశాలు కనిపించాయి.
బెల్లం ఎక్కడుంటే? చీమలు అక్కడ ఉంటాయి. `బాహుబలి`తో సత్తా చాటిన తర్వాత రాజమౌళిని బాలీవుడ్ కి తీసుకెళ్లిపోవాలని అక్కడ నిర్మాతలు ఎంతగా ప్రయత్నించారో తెలిసిందే. కానీ ఆయన కదలకపోవడంతో? వాళ్లే ఇక్కడకొస్తామన్నారు. కానీ ఆ ఛాన్స్ రాజమౌళి వాళ్లకి ఇవ్వలేదు. తాను ఏం చేయాలనుకున్నా? టాలీవుడ్ నుంచే చేస్తానని కూర్చున్నారు. ఇక్కడ హీరోలు, నిర్మాతలతోనే సినిమాలు చేస్తున్నారు. అలాగే ప్రభాస్ తోనూ బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ లు తమ బ్యానర్లో అవకాశాలు కనిపించాయి.
కానీ డార్లింగ్ కూడా తొందర పడలేదు. ఈ విషయంలో ఎంతో బ్యాలెన్స్ గా ముందుకెళ్తున్నారు. ఇప్పుడా వంతు సుకుమార్ ది. `పుష్ప` ప్రాంచైజీతో ఆయన బాలీవుడ్ లో బ్రాండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. `పుష్ప` మొదటి భాగం 400 కోట్లు కలెక్ట్ చేస్తే అందులో అధిక భాగం షేర్ హిందీ మార్కెట్ నుంచే వచ్చింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన `పుష్ప-2` హిందీ ఆడియన్స్ లో అల్ల కల్లోలమే సృష్టించిన సంగతి తెలిసిందే. నార్త్ నుంచి 600 కోట్ల వసూళ్లను సాధించింది.
తొలి రోజు ఖాన్ లు..కపూర్ ల రికార్డులు సైతం చెరిపేసింది. మరి అలాంటి సంచలనాలు నమెదు చేసిన డైరెక్టర్ ని హిందీ హీరోలు అంత ఈజీగా ఎలా వదిలి పెడతారు? ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పించరు. ఇప్పుడదే జరుగుతుందని సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు చేయాలని అక్కడ ఖాన్ లు..కపూర్ స్టార్ హీరోలంతా ఆశపడుతున్నారుట. ప్రత్యేకంగా ఓ హీరో పేరంటూ తెరపైకి రాలేదు గానీ ఆయనతో పనిచేయడానికి మాత్రం తామెప్పుడు సిద్దమనే సంకేతాలు హీరోలంతా పంపిస్తున్నారుట.
`బాహుబలి` సక్సెస్ అయిన తర్వాత రాజమౌళి కోసం అమీర్ ఖాన్ కూడా ఇలాగే తపించారు. కానీ ఇప్పటి వరకూ ఆ కాంబినేషన్ సాధ్యం కాలేదు. జక్కన్న తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. మరి సుకుమార్ హిందీ హీరోల అవకాశాల పట్ల ఏమంటారో చూడాలి. ప్రస్తుతానికి లెక్కలు మాష్టారు హైదరాబాద్ లో ఉండి పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. ఆర్సీ 17 ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే.