సెకెండ్ మ్యారేజ్ పై సంచలన వ్యాఖ్యలు!
రాఖీ సావంత్-అదిల్ దురానీ ప్రేమ..పెళ్లి..విడాకుల వ్యవహారం అప్పట్లో ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే.
రాఖీ సావంత్-అదిల్ దురానీ ప్రేమ..పెళ్లి..విడాకుల వ్యవహారం అప్పట్లో ఎంతటి దుమారం రేపిందో తెలిసిందే. ఎంత ఘాడంగా ప్రేమించుకున్నారో? కలతలు చోటు చేసుకున్న తర్వాత అంతకంత బద్ద శత్రువుల్లా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. భర్త కోసం రాఖీ ఎన్నో రకాల త్యాగాలు చేసింది. చివరికి అదే భర్తను జైల్లో కూడా పెట్టించింది. విడాకులతో వేరై ఎవరి స్వేచ్ఛ వారు కోరుకున్నారు.
ఇటీవలే అదిల్ దురానీ `బిగ్ బాస్` ఫేం సోమీ ఖాన్ ని రెండవ వివాహం కూడా చేసుకున్నాడు. దీంతో అతడి వివాహం సీక్రెట్ గా జరిగిందని..ఇంత రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అని అదిల్ పై బాలీవుడ్ మీడియాలో రకరకాల ప్రచారం సాగింది. రాఖీ సావంత్ విషయంలో అతడు అన్యాయం చేసినట్లు కొంత మంది ఆరోపించారు.
ఈ సందర్భంగా అదిల్ రెండవ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. `చాలా మంది రెండవ పెళ్లి ఎలా చేసుకున్నానని అడుగుతున్నారు. నేను ముస్లీంమ్ ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. రహస్యంగా నిఖా చేసుకోలేదు. అలా చేసుకుంటే తప్పు అవుతుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో అందరికీ అంగీకారంతో చేసుకున్నాను. రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసాను. నాభార్యతో సంతోషంగా ఉన్నాను.
నాకంటూ మంచి జీవితం ఉంది. నా మాజీ భార్య రాఖీసావంత్ ఎప్పుడూ నెగిటివ్ గానే ఉండేది. ఏనాడు నాకు సంతోషాన్ని అందించలేదు. ఆమె ఎవరి జీవితంలోకి వెళ్లినా? అక్కడ సంతోషం ఉండదు. అన్నీ కష్టాలు..బాధలే నిండి ఉంటాయి. నేను ఆమెకి పూర్తి భిన్నంగా ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా చుట్టూ ఉన్న వారికి సంతోషం పంచాలనుకుంటాను. సోమీ నాజీవితంలో వెలుగులు నింపింది. తనతో సంతోషంగా ఉన్నాను` అని అన్నాడు.