అంబానీ ఇంట ఇలా మెర‌వాల‌ని ముందే అనుకున్నారా?

నిన్న‌టి రోజున అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ ల‌వి వావాహం ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-07-13 07:01 GMT

నిన్న‌టి రోజున అనంత్ అంబానీ-రాధిక మ‌ర్చంట్ ల‌వి వావాహం ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దాదాపు అందుబాటులో ఉన్న బాలీవుడ్ సెల‌బ్రిటీలంతా పాల్గొన్నారు. ముఖ్యంగా న‌వ‌త‌రం భామ‌ల్లో ఏ ఒక్క‌రూ మిస్ అవ్వ‌లేదు. అంతా హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలో వెడ్డింగ్ లో ఎవ‌రి స్టైల్లో వారు అల‌రించారు. డిజైన‌ర్ దుస్తుల్లో పెళ్లి వేడుక మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడింది.

ఎటు చూసినా అందాలే...పాల నురుగల సౌంద‌ర్య‌లే. డిజైన‌ర్ దుస్తుల్లో ప్ర‌తీ ఒక్క‌రూ సంథింగ్ స్పెష‌ల్ అనిపించారు. ఎవ‌రి స్లైల్లో వారు ముస్తాబైన విధానం ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా మారింది. తాజాగా అన‌న్య పాండే, శాన‌య్య క‌పూర్, ఖుషీ క‌పూర్ ముస్తాబైన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ముగ్గురు భామ‌లు అంబానీ ఇంట పెళ్లికి ఒకే డ్రెస్ కోడ్ లో వ‌చ్చారు. రంగులో మారాయి త‌ప్ప డిజైన్ లో ఎలాంటి మార్పులు లేవు.

ముగ్గురు ఒకే డిజైన్ ఔట్ ఫిట్ లో మెరిసారు. అన‌న్యా పాండే పుసుపు వ‌ర్ణం బ్లౌజ్ లో త‌ళుకులీన‌గా, ఖుషీ క‌పూర్ గ్రీన్ క‌ల‌ర్ లో ఎంతో అందంగా ముస్తాబైంది. శాన‌య్య క‌పూర్ బ్లూ అండ్ మ‌ల్టీ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో అందంగా ముస్తాబైంది. ఈ డిజైన్ చూసి ముగ్గురు ఓ మాట అనుకునే ఇలా ముస్తాబైన‌ట్లు క‌నిపిస్తోంది. భామలంతా అతిధి హోదాలో కెమెరాకి ఫోజులిచ్చినా ఆ మ‌గ్గురి గురించి మిగ‌తా అతిధులు ముచ్చ‌టిం చుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. నెటి జనులంతా బ్యూటీల‌ని చూసి ఆస్వాదిస్తున్నారు. ఇక కెరీర్ ప‌రంగా అన‌న్య కొత్త అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా, శాన‌య్య క‌పూర్ కూడా అదే ప‌నిలో ఉంది. ఖుషీ క‌పూర్ మాత్రం క‌ర‌ణ్ జోహాన్ బ్యాన‌ర్లో హీరోగాయిన్ ప‌రిచ‌య‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు ఆ సినిమా పనుల్లోనే బిజీగా ఉంది.

Tags:    

Similar News