అక్క కి రివర్స్ లో వెళ్తున్న ఖుషి కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి తన కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి తన కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారు. ఆమె బతికి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ మొదటి సినిమా ప్రారంభం అయింది. కానీ దురదృష్టం కొద్ది శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ సినిమా ఎంట్రీని చూడలేక పోయారు. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది.
సక్సెస్ వచ్చినా రాకున్నా కూడా హిందీ సినిమాల్లోనే నటిస్తాను అంటూ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు భీష్మించుకు కూర్చున్న జాన్వీ కపూర్ ఎట్టకేలకు సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ఓకే చెప్పింది. ఎన్టీఆర్ కి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది.
జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ నుండి టాలీవుడ్ కి వచ్చింది. కానీ ఆమె సోదరి ఖుషి కపూర్ మాత్రం బాలీవుడ్ లో సినిమాలు చేయకుండా డైరెక్ట్ టాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటిగా, టెక్నీషియన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఖుషి కపూర్ హీరోయిన్ వేశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖుల వద్ద జాన్వీ కపూర్ తన సోదరి సౌత్ సినీ ఎంట్రీ గురించి మాట్లాడింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హిందీ సినిమాల్లో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా కూడా సౌత్ లో మొదట నిరూపించుకోవాలని ఖుషి కపూర్ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
తల్లి ఎలా అయితే సౌత్ నుండి బాలీవుడ్ కి వెళ్లిందో అలాగే కూతురు ఖుషి కూడా సౌత్ లో సక్సెస్ అయి బాలీవుడ్ కి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అక్క జాన్వీ కపూర్ బాలీవుడ్ లో నిరూపించుకుని సౌత్ లో అడుగు పెడితే.. ఖుషి మాత్రం రివర్స్ గా సౌత్ లో నిరూపించుకుని బాలీవుడ్ కి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. మరి ఖుషి ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.