ప‌చ్చ కోక ఎర్ర గులాబీలు మ‌తి చెడ‌గొట్టిన ర‌ష్మిక‌

పుష్ప‌లో శ్రీ‌వ‌ల్లిగా, యానిమ‌ల్ లో గీతాంజ‌లిగా అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది.

Update: 2024-07-29 03:48 GMT

ప‌చ్చ కోక.. ఎర్ర గులాబీలు .. కాంబినేష‌న్ ల‌వ్ సింబ‌ల్ హ్యాండ్ బ్యాగ్ తో బ్యాక్ ఫీట్ లో ఫోటోగ్రాఫ‌ర్స్ కి ఫోజులిచ్చి గుబులు రేపింది ర‌ష్మిక మంద‌న‌. చీర ర‌వికెలో స్టన్నింగ్ ఫోజుల‌తో మ‌తి చెడ‌గొట్టిన ఈ బ్యూటీ ఒక్క కన్న‌గీటుడు ఫీట్ తో మైండ్ బ్లాక్ చేసింది. ర‌ష్మిక‌ అదిరిపోయే ఫ్యాష‌న్ సెన్స్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది.


పుష్ప‌లో శ్రీ‌వ‌ల్లిగా, యానిమ‌ల్ లో గీతాంజ‌లిగా అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న వ‌రుస చిత్రాల్లో న‌టిస్తోంది. అటు స‌ల్మాన్ ఖాన్- ఏ.ఆర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సికంద‌ర్ లో ర‌ష్మిక మంద‌న్న అవ‌కాశం అందుకుంది. ధనుష్‌తో కలిసి కుబేరలో కనిపించనుంది. ఈ చిత్రంలో రష్మిక - ధనుష్‌లతో పాటు అక్కినేని నాగార్జున- జిమ్ సర్భ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కుబేర పాన్-ఇండియన్ రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలయ్యే అవకాశం ఉంది.


అల్లు అర్జున్ - ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించిన `పుష్ప: ది రూల్`లోను రష్మిక తిరిగి శ్రీ‌వ‌ల్లిగా త‌న పాత్ర‌తో మైమ‌రిపించ‌నుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనంజయ, జగదీష్ ప్రతాప్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలోని స‌స్పెన్స్ చిత్రం `ది గర్ల్‌ఫ్రెండ్`లోను ర‌ష్మిక న‌టిస్తోంది. ధీక్షిత్ శెట్టి సరసన కనిపిస్తుంది. రెయిన్ బో అనే తెలుగు చిత్రంలోను ర‌ష్మిక న‌టిస్తోంది.

Tags:    

Similar News