బాక్సాఫీస్.. ఆగని బాలయ్య గర్జన

దసరా సినిమాల్లో హైప్ వల్ల తొలి రోజు లియో కాస్త ఎక్కువ ఎడ్జ్ తీసుకున్నట్టు అనిపించినా.. ఆ తర్వాత భగవంత్ కేసరి పాజిటివ్ టాక్​తో డామినేషన్ అంతకంతకూ పెరుగుతూ పోయింది.

Update: 2023-10-26 09:08 GMT

ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే నట సింహాం నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం హ్యాట్రిక్​ హిట్​తో ఫుల్ జోష్​లో ఉన్నారు. భగవంత్​ కేసరిగా గర్జిస్తూ ఇప్పటికే ఆరు రోజుల్లో రూ.100కోట్లకు పైగా కొల్లగొట్టిన ఆయన.. ఇప్పుడు ఏడో రోజు దసరా పూర్తైన తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. కలెక్షన్స్​ వివరాళ్లోకి వెళితే..

దసరా సినిమాల్లో హైప్ వల్ల తొలి రోజు లియో కాస్త ఎక్కువ ఎడ్జ్ తీసుకున్నట్టు అనిపించినా.. ఆ తర్వాత భగవంత్ కేసరి పాజిటివ్ టాక్​తో డామినేషన్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. దసరా సెలవులను వినియోగించుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ ముందు ఆధిపత్యం చెలాయించింది. దీంతో రవితేజ, దళపతి విజయ్ ఆ తర్వాతి స్థానాలతో సర్దుకోవాల్సి వచ్చింది. మెయిన్ సెంటర్స్​ అన్నీ బాలయ్య సినిమతో హౌస్ ఫుల్స్ పడ్డాయి.

ఫ్యామిలీ ఆడియెన్స్​, మాస్​ ఆడియెన్స్​ ఈ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రతిరోజు నెంబర్ల ఫిగర్లు మంచిగా నమోదయ్యాయి. అలా వారం రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను ఖాతాలోకి వేసేసుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఏడో రోజు రూ. 4 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 5 కోట్లు వరకూ రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ రూ. 55 కోట్లు వరకూ షేర్ కలెక్ట్ చేసిందట. ఇండియా వైడ్​గా ఆరో రోజు రూ.6కోట్ల వరకు నెట్ అందుకుని.. మొత్తంగా 66.35కోట్ల వరకు వసూలు చేసిందని తెలిసింది.

ఇకపోతే ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఇంకో వీకెండ్ కూడా కేసరి కంట్రోల్​లోకి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీలీల విజ్జీ పాప పాత్ర సెంటిమెంట్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలు కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడం టీమ్ ప్రమోషన్​కు బాగా ఉపయోగపడుతోంది

Tags:    

Similar News