పుష్పరాజ్, భన్వర్ సింగ్ మెచ్చిన 'స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌'.

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటానికే ప్రయత్నిస్తానని చెప్పారు సీనియర్​ నటుడు బ్రహ్మాజీ.

Update: 2023-07-27 12:20 GMT

ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండటానికే ప్రయత్నిస్తానని చెప్పారు సీనియర్​ నటుడు బ్రహ్మాజీ. ఆయన కొడు కు సంజయ్‌రావు హీరోగా నటించిన చిత్రం 'స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌' జులై 29న రిలీజ్ కానుంది. చిత్రం లో బ్రహ్మాజీ, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మించింది. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాల ను పంచుకున్నారు.

ఈ చిత్రం లో ఓ కొత్త పాత్రలో కనిపిస్తాడు. ఓల్డ్ సిటీ లో ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే లాయర్ గా కనిపిస్తాను. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌ నా పాత్ర. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ సమయంలో ఈ కథ మా దగ్గర కు వచ్చింది. కాన్సప్ట్ కొత్తగా ఉంది ఓకే చేశాం. సంజయ్ డాగ్ లవర్ కావడం వల్ల కథకు ఈజీ గా కనెక్ట్ అయ్యాడు.

పుష్ప 2 షూటింగ్ సమయం లో అల్లుఅర్జున్, ఫాహద్ ఫజిల్ ట్రైలర్‌ ను చూసి ప్రశంసించారు. అమెరికా వెళ్లడం వల్ల సుకుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు రాలేను వీడియో బైట్ పంపిస్తాను అని చెప్పారు. సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ చిత్రం లో మా ఇద్దరి సీన్లు పోటాపోటీ గా ఉంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్‌గా ఉంటుంది.

జూలై 21న రిలీజ్ చేయాల ని అనుకున్నాం. అప్పుడు సినిమా రిలీజ్ లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే జూలై 29న నిర్ణయించాం. జూలై 28న బ్రో టికెట్లు దొరక్కపోతే మా సినిమాకే వస్తారు. అనిల్ రావిపూడి, ప్రదీప్, అలీ, నాగార్జున ఇలా అందరూ సపోర్ట్ చేశారు. అందరి ప్రేమాభిమానాలు దొరికినందుకు సంతోషంగా ఉంది.

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని ప్రయత్నిస్తాను. అప్పుడే యంగ్‌గా కనిపిస్తాం. భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. మా సినిమా కు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. సినిమా మ్యూజికల్ హిట్ అవుతుంది. పుష్ప మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ అదిరిపోతుంది. ఇంకా మహేష్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్, బాలయ్య గారి భగవంత్ కేసరి, ఊరి పేరు భైరవకోన, నాగ శౌర్యతో ఓ సినిమా చాలానే చేస్తున్నాను. ప్రభాస్ సలార్ లో నా పాత్ర కొత్తగా ఉంటుంది. రెండో భాగం లో ఎక్కువగా కనిపిస్తాను.

Tags:    

Similar News