గ్లోబ‌ల్ స్టార్ చ‌ర‌ణ్‌పై ఫ్రెంచ్‌ న‌టుడి ప్ర‌శంస‌లు

ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ లో సీతా రామ‌రాజు పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు రామ్ చ‌ర‌ణ్‌.

Update: 2024-08-16 06:28 GMT

ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ లో సీతా రామ‌రాజు పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు రామ్ చ‌ర‌ణ్‌. అత‌డి పాత్ర ఆద్యంతం భారీ యాక్ష‌న్, ఎమోష‌న్స్ తో ర‌క్తి క‌ట్టిస్తుంది. బ్రిటీష‌ర్ల త‌ర‌పున భార‌తీయ ఉద్య‌మ‌కారుల‌పైనే దాడికి దిగే సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా చ‌ర‌ణ్ న‌ట‌న హావ‌భావాలను ప్ర‌జ‌లు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. చ‌ర‌ణ్ న‌ట‌న‌కు ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆర్.ఆర్.ఆర్ మూవీని వీక్షించాక బ్రిటీష్ రాణులు సైతం చ‌ర‌ణ్ ని విప‌రీతంగా మెచ్చుకున్నారు. టాప్ మోడ‌ల్స్, న‌టీమ‌ణులు అత‌డి న‌ట‌న‌కు, ఛామింగ్ లుక్ కి ఫిదా అయిపోయారు.

ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని నాటు నాటు ఒరిజిన‌ల్ మ్యూజిక్ కేట‌గిరీలో ఆస్కార్ గెలుచుకోవ‌డం ఒక సంచ‌ల‌నం. హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారాలు, గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాలు దక్క‌డంతో ఆర్.ఆర్.ఆర్ మూవీపై ప్ర‌పంచం న‌లుమూల‌ల క‌ళాకారుల దృష్టి ప‌డింది. రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌ను పాపుల‌ర్ హాలీవుడ్ డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరూన్ అంత‌టి వాడే కొనియాడారు. ప‌లువురు హాలీవుడ్ స్టార్లు చ‌ర‌ణ్ న‌ట‌న‌ను ప్ర‌త్యేకించి కీర్తించారు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఈ చిత్రంలో అద్భుతంగా న‌టించార‌ని ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నారు. ఇక‌ ఫ్రెంచ్ నటుడు లుకాస్ బ్రావో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ ఫెంటాస్టిక్ గా నటించాడు! అని, ఈ మూవీలో చ‌ర‌ణ్ ఫైట్స్, ఎమోషనల్ పెర్ఫామెన్స్ అద్భుతంగా పండింద‌ని లూకాస్ బ్రావో కితాబిచ్చారు. ముఖ్యంగా రామ్ చరణ్ న‌ట‌న‌పై అత‌డు ప్రశంసలు కురిపించాడు. ఈ ప్ర‌శంస‌లు చ‌ర‌ణ్ కి వ‌ర‌ల్డ్ వైడ్ పెరుగుతున్న పాపులారిటీని ఆవిష్క‌రిస్తుంది. ఇదే హుషారులో అత‌డు త‌న త‌దుప‌రి చిత్రం గేమ్ ఛేంజ‌ర్‌ని వ‌ర‌ల్డ్ వైడ్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడా? అంటూ అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చ‌ర‌ణ్ కి పెరిగిన క్రేజ్ తో ఇత‌ర దేశాల మార్కెట్ల‌లోను జోరు చూపించే వీలుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మెల్ బోర్న్‌లో మెరుపులా:

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం మెల్ బోర్న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 15వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లో రామ్ చరణ్ `అంబాసిడర్ ఫర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అవార్డు`ను అందుకోనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమై ఆగస్టు 25న ముగియనుంది. ఈరోజు తెల్లవారుజామున రామ్ చరణ్ మెల్ బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అత‌డు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా పెద్ద ఎత్తున జనం ఆయనను గుమికూడిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ తదుపరి శంకర్ పాన్-ఇండియా పొలిటికల్ డ్రామా `గేమ్ ఛేంజర్‌`లో కనిపించనున్నారు. సెప్టెంబర్‌లో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ చిత్రం షూటింగ్‌ను చ‌ర‌ణ్ ప్రారంభిస్తారు. ఇప్ప‌టికే ఈ మూవీని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Tags:    

Similar News