42 ఏళ్ల వయసులో పాప్ సింగర్ కీ నాలుగోపెళ్లి!
ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
జీవితంలో పెళ్లి ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. అందుకు అడ్డు చెప్పేదెవరు? చట్టపరంగా విడిపోయిన తర్వాత లెక్కలేనన్ని పెళ్లి చేసుకునే వెసులు బాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల వెసులు బాటు ఉంది. ఇదే రూల్ పాటిస్తోంది హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్. 42 ఏళ్ల వయసులో అమ్మడు నాల్గవ పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
మరి అమ్మడు పెళ్లాడిన పెళ్లి కొడుకు ఎవరు? అనుకుంటున్నారా? ఆవిషయం తెలిస్తే షాక్ అవుతారు. అవును ఇక్కడ పెళ్లి కూతురు..పెళ్లి కొడుకు తనే అయింది. అమ్మడు తనని తానే స్వీయా వివాహం చేసుకుంది. 'ఈరోజు నాతో నాకే పెళ్లి అయింది. మీకిది తెలివి తక్కువ పని అనిపించొచ్చు. కానీ నాకు మాత్రం ఇప్పటివరకూ నేను చేసిన పనిలో ఇదో అద్భుతమైన పని' అని రాసుకొచ్చింది. ఇది చూసి నెటి జనులు నవ్విపోతున్నారు.
ఇదేం పైత్యం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే బ్రిట్నీ స్పియర్ మూడు సార్లు పెళ్లి చేసుకుంది. తొలుత చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్ ను పెళ్లి చేసుకుంది. 2004లో వివాహం జరగగా కొన్ని రోజులకు మన స్పర్దల కారణంగా విడిపోయారు. అటుపై అదే ఏడాది డాన్సర్ , నటుడు కెవిన్ పెడెర్ లైన్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కలిగారు. అయితే ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2007లో విడిపోయారు.
అనంతరం అమ్మడు 2016 లో నటుడు సామ్ అస్గారితో డేటింగ్ చేసింది. ఆరేళ్ల ప్రేమ అనంతరం 2022లో మూడవ పెళ్లి చేసుకుంది. ఈ జోడీ ఈ మద్యనే విడిపోయింది. అలా మూడు సార్లు పెళ్లి చేసుకుని విడాకులిచ్చి...నాల్గవసారి స్వీయా వివాహం చేసుకుంది.