'బ్రో' సెన్సార్ రిపోర్ట్.. ఈ మాత్రం చాలు చెలరేగిపోవడానికి

ఇక సెన్సార్ బోర్డు నుంచి ఒక కట్ కూడా లేకుండా ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ లభించడం విశేషం.

Update: 2023-07-24 12:25 GMT

పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ రచన సహకారంతో సముద్రఖని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా పై మొదట్లో అంతంతమాత్రంగానే కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరిగాయి. కానీ సాంగ్స్ విడుదల చేసిన తర్వాత మళ్ళీ కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

సినిమా టీజర్ కూడా అంతగా క్లిక్ కాలేదు. ఇక ఎప్పుడైతే ట్రైలర్ విడుదల అయిందో అప్పుడే సినిమా పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ ఎనర్జీతో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. తప్పకుండా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది అని కూడా క్లారిటీ వచ్చేసింది.

ఇక మొత్తానికి బ్రో సినిమా కు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక సెన్సార్ బోర్డు నుంచి ఒక కట్ కూడా లేకుండా ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ లభించడం విశేషం. ఈ మధ్యకాలం లో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు అంతగా క్లిక్ కాలేదు. కానీ అగ్ర హీరోల్లో ఎవరైనా క్లీన్ యు సర్టిఫికెట్ తో వస్తే తప్పకుండా ఆ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఊహించని స్థాయి లో క్రేజ్ వస్తూ ఉంటుంది. ఎలాంటి బ్యాడ్ వర్డ్స్, గ్లామర్ డోస్, కాంట్రవర్సీల కు తావివ్వకుండా సెట్ చేసినట్లు తెలుస్తోంది.

కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా కలెక్షన్స్ ఊహించని స్థాయి లోనే ఉంటాయి. ఇక టికెట్ల రేట్లు కూడా ఏమాత్రం పెంచలేదు కాబట్టి చిత్ర నిర్మాతలు సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థమవుతుంది. సినిమా బాగుంటే రెండు వారాల వరకు థియేటర్స్ కళకళలాడుతూ ఉంటాయి. ఇక ఎలాగూ ఫస్ట్ వీకెండ్ లో ఫ్యాన్స్ హడావిడి ఉంటుంది ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మంచి సపోర్ట్ వస్తే తప్పకుండా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువే వచ్చే అవకాశం అయితే ఉంది.

ఇక మరొక కలిసి వచ్చే అంశం ఏమిటి అంటే.. ఈ సినిమా రన్ టైం కూడా అంత ఎక్కువ ఏమీ లేదు. 2 గంటలు 14 నిమిషాలు కావడంతో అక్కడే చాలా మంది ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా లో సోది లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ సీన్స్ సెట్ చేసారని అంటున్నారు. ఇక ఈ సినిమా లో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ ముఖ్యమైన పాత్రల లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News