తమిళ సినిమా వినోదయ సీతం ని తెలుగులో బ్రోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో బ్రో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్, సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎంత భారీ రేంజ్ లో ప్లాన్ చేసినా అవేవి పెద్దగా వర్క్ అవుట్ అవ్వట్లేదు. బ్రో సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ మై డియర్ మార్కండేయ కూడా థమన్ నిరాశపరచాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు సినిమా రిలీజ్ కి 12 రోజులు మాత్రమే ఉండగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఏదో సాయి తేజ్ తో ఏదో ప్రయత్నాలు చేస్తున్నా అది ఫ్యాన్స్ కి రీచ్ అవ్వట్లేదు. బ్రో సినిమాను పవన్ చాలా తక్కువ టైం లో పూర్తి చేశారు.
అయితే ఆ సినిమా ప్రమోషన్స్ కి పవన్ టైం ఇస్తాడా అన్నది డౌట్ గా మారింది. ప్రస్తుతం పవన్ రాజకీయ యాత్రల్లో బిజీగా ఉన్నాడు. పవన్ ఉన్నాడు కాబట్టి బ్రో సినిమాకు రాజకీయ పరమైన సమస్యలు రాక తప్పదు.
ఈ నెల చివరన రిలీజ్ పెట్టుకుని బ్రో సినిమా యూనిట్ సైలెంట్ గా ఉండటం ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లేలా ఇంటర్వ్యూస్, ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేయాలి. అయితే రిలీజ్ కి వారం ఉందనగా ఏదో హడావిడిగా ఓ ఈవెంట్, రెండు ఇంటర్వ్యూస్ చేసి సినిమా రిలీజ్ చేద్దామనే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది.
అంతేకాదు బ్రో సినిమాకు ఇంకా థియేట్రికల్ బిజినెస్ కొన్ని చోట్ల పూర్తి కాలేదని అంటున్నారు. ధమాకా హిట్ తర్వాత వరుస షాక్ లు ఎదుర్కొంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి బ్రో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
సాయి తేజ్ మాత్రం బ్రో సినిమాను తన భుజాన వేసుకుని తన పంథాలో తను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ వస్తారని చెప్పొచ్చు. పవన్, సాయి తేజ్ తో పాటుగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందట. ఇప్పటిదాకా ఎలా ఉన్నా మెగాస్టార్ ఎంట్రీతో బ్రో పై మెగా, పవర్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.