బుచ్చి బాబు తో చరణ్.. అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్..!
RRR తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రాం చరణ్ ఆచార్య తర్వాత శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే
RRR తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రాం చరణ్ ఆచార్య తర్వాత శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తి కాగానే ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు డైరెక్షన్లో చరణ్ సినిమా లాక్ చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బుచ్చి బాబు చరణ్ కాంబోగా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ చేస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్.రెహమాన్ ని ఫిక్స్ చేశారు.
ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చి బాబు చరణ్ తో చేసే సినిమాతో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నాడని అర్థమవుతుంది. ఈ సినిమా కథ కథనాలు మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఆడియన్స్ కు నచ్చేస్తాయని అంటున్నారు. ఇక చరణ్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుందని టాక్. చరణ్ క్యారెక్టరైజేషన్ కోసం బుచ్చి బాబు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. సినిమాలో చరణ్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తాడని అంటున్నారు. చరణ్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తాడని చెబుతున్నారు.
బుచ్చి బాబు ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా ఆడియన్స్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ అందరినీ మెప్పించేలా ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ దశలోనే సినిమాపై పాజిటివ్ రిపోర్ట్ రాగా సినిమా సెట్స్ మీదకు వెళ్లాక మరింత బజ్ పెంచేస్తుందని అంటున్నారు. పీరియాడికల్ కథతో బుచ్చి బాబు ఈసారి మెగా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. గేమ్ చేంజర్ ముగించిన వెంటనే చరణ్ ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.
ఆర్16వ వస్తున్న ఈ సినిమా చరణ్ రేంజ్ ఏంటన్నది మరోసారి చూపిస్తుందని అంటున్నారు. మైత్రి ప్రొడక్షన్స్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా నో లిమిట్స్ అనేస్తున్నారట. మొత్తానికి ఆర్సీ 16 విషయంలో వస్తున్న వార్తలన్నీ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. మరి బుచ్చి బాబు చరణ్ సినిమాలు ఎలా తెరకెక్కిస్తాడన్నది చూడాలి. ట్రిపుల్ ఆర్ తో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని మెప్పించిన చరణ్ తన ప్రతి సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సినిమాలు చేస్తున్నాడు. తప్పకుండా చరణ్ 16వ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.