కల్కి ప్రీల్యూడ్ ఎలా ఉంది..?

జూన్ 27న రిలీజ్ కాబోతున్న కల్కి సినిమా ప్రమోషన్స్ లో బుజ్జితో కలిసి ప్రభాస్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

Update: 2024-05-31 13:38 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో కల్కి సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. సినిమాలో బుజ్జి అంటూ ఒక ఎలక్ట్రిక్ కారుని కల్కి కోసం తయారు చేశారు. జూన్ 27న రిలీజ్ కాబోతున్న కల్కి సినిమా ప్రమోషన్స్ లో బుజ్జితో కలిసి ప్రభాస్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

ఆడియన్స్ కు కల్కి మీద ఒక అవగాహన కల్పించేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి ప్రీల్యూడ్ అంటూ కొంత కథను చెబుతున్నాడు. లేటెస్ట్ గా రిలీజైన కల్కి సినిమాటిక్ యూనివర్స్ లోని రెండు ఎపిసోడ్స్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కాంప్లెక్స్ లో ప్రమోషన్ కోసం ఎదురుచూసే బుజ్జి అది తీసుకెళ్తున్న లోడ్ ని దుండగులు దాడి చేసి అందులో ఉన్న ఫ్రూట్స్ లగేజ్ అంతా తీసుకెళ్తారు. అయితే తన గ్యారేజ్ ని కూడా బ్లాస్ట్ చేయగా బుజ్జిని మాత్రం స్క్రాప్ లో పడేస్తారు.

మరోపక్క భైరవ బ్రహ్మానందం దగ్గర ఉంటూ డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. తన దగ్గర ఉన్న కొద్దిమొత్తంతో ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. యాక్సిడెంటల్ గా బుజ్జి భైరవ మీట్ అవుతారు. తనని వాడుకుని ఒక వాహనం సిద్ధం చేయమని భైరవకు చెబుతుంది బుజ్జి ఆ ప్రయత్నంలో బుజ్జిని మళ్లీ పూర్తిగా సిద్ధం చేస్తాడు భైరవ. బుజ్జి తన గమ్యస్థానమైన కాంప్లెక్స్ కి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. భైరవ దాన్ని మళ్లీ వెనక్కి వచ్చేలా చేస్తాడు. బుజ్జి భైరవ ఇద్దరు పొట్లాడుకుంటే కాదు కలిసి ఏదైనా చేయాలని అనుకుంటారు. బుజ్జి & భైరవ ఏం చేశారు అన్నదే కల్కి సినిమాటిక్ యూనివర్స్.

ఒక గొప్ప కథ చెప్పబోతున్నామనే కాదు గొప్ప విజువల్స్ తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధం అనేలా కల్కి ప్రీల్యూడ్ ఉంది. అంతేకాదు భైరవ పాత్రలో ఉండే ఫన్ ఎలిమెంట్స్ అతని సాహసాలు శాంపిల్ గా చూపించారు. ఓవరాల్ గా చూస్తే కల్కి ప్రీల్యూడ్ అదే యానిమేటెడ్ ఎపిసోడ్స్ మెప్పించాయనే చెప్పాలి. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే అసలు కథ వేరే ఉందని తెలుస్తుంది.

చూస్తుంటే నాగ్ అశ్విన్ నిజంగానే ఒక మహా అద్భుతాన్ని సృష్టించేలా ఉన్నాడు. భైరవ పాత్రలో ప్రభాస్ మరో సంచలనానికి సిద్ధం అయ్యాడని చెప్పొచ్చు. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కనిపించేలా నాగ్ అశ్విన్ టేకింగ్ ఉందనిపిస్తుంది. మరి కల్కి యానిమేటెడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News