బుజ్జి - భైరవ.. యానిమేషన్ ట్రైలర్ ఆగయా..
అశ్విని దత్ వైజయంతి మూవీస్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.
చాలా రోజుల తర్వాత విడుదలవుతున్న బిగ్గెస్ట్ ఫ్యాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా భాషల్లో విడుదల కాబోతోంది. అశ్విని దత్ వైజయంతి మూవీస్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఒక్కో అప్డేట్ తో మూవీపై అంచనాల స్థాయిని మరింత పెంచుతున్నారు. ప్రభాస్ కు జోడిగా ఈ సినిమాలో దీపిక పదుకొనే నటించిన విషయం తెలిసిందే. అలాగే మరో గ్లామరస్ బ్యూటీ దిశాపటానీ కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించబోతోంది. అయితే ఈ సినిమాలో ఆశ్చర్యపరిచే అంశాలు ఎన్నో ఉన్నట్లుగా ఇటీవల విడుదల చేసిన బుజ్జి టీజర్ తో మరో క్లారిటీ వచ్చేసింది.
ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తుండగా అతడికి తోడుగా బుజ్జి అనే రోబోటిక్ కారు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కంటే ముందుగా బుజ్జిని మరీంత హైలెట్ చేస్తున్నారు. బుజ్జి అండ్ భైరవ పేరుతో ఓ యానిమేషన్ సిరీస్ ను రూపొందించడం విశేషం.
ఈ యానిమేషన్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో మే 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా స్పెషల్ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో బుజ్జి, భైరవలు కలిసి ప్రత్యర్థులపై దాడి చేసిన విధానం హైలెట్ అయ్యింది. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇక ప్రభాస్ పాత్రకు తనే డబ్బింగ్ చెప్పగా బుచ్చి పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. ఏదో నామమాత్రంగా కాకుండా పక్క ప్రణాళికతో ఒక మంచి యానిమేషన్ సిరీస్ ను మేకర్స్ అందించబోతున్నారు.
ఎక్కువగా పిల్లలను అట్రాక్ట్ చేయనున్న ఈ యానిమేషన్ సిరీస్ ఏమాత్రం క్లిక్ అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఇక చాలా రోజులుగా ఒక మంచి సినిమా కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక కల్కి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. మరి ప్రభాస్ ఈసారి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలే.