తండేల్.. అల్లు అరవింద్ స్టాంప్ వేసేశారు!

తండేల్.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఆ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

Update: 2025-01-27 04:40 GMT

తండేల్.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఆ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్స్యకార గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మూవీ అవుట్ పుట్ పై మంచి హోప్స్ పెట్టుకున్నారు.

అదే సమయంలో మేకర్స్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు సాంగ్స్ తో పాటు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో తండేల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.

తాజాగా నిర్మాత బన్నీ వాసు క్రేజీ పిక్ ను పోస్ట్ చేశారు. తండేల్ ఫైనల్ కాపీ చూస్తున్నట్లు కనిపిస్తున్న ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. "డిస్టింక్షన్ తో మూవీ పాస్ అయింది. అల్లు విశ్వవిద్యాలయం డీన్ అల్లు అరవింద్ గారు ధ్రువీకరించారు" అంటూ రాసుకొచ్చారు. అంటే అరవింద్ ముద్ర వేసినట్లే అర్థమని చెప్పాలి.

దీంతో మేకర్స్.. సినిమా విషయంలో ఫుల్ క్లారిటీగా ఉన్నారని క్లియర్ గా అర్థమవుతుంది. కచ్చితంగా పెద్ద హిట్ కొట్టనున్నామనే ధీమాగా ఉన్నారు. ఇప్పటికే పలు ఈవెంట్స్ లో కూడా సినిమా కోసం గొప్పగా మాట్లాడారు అల్లు అరవింద్. సమయం వచ్చినప్పుడల్లా బన్నీ వాసు.. మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు.

అలా తండేల్ పై ఆడియన్స్ లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. దానికి తోడు మేకర్స్ చేస్తున్న ప్రమోషన్స్ వీటిని ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి. మొత్తానికి తండేల్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అవ్వడం ఖాయమని అంతా అంచనా వేస్తున్నారు. మరి ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానున్న తండేల్.. ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News