వారం రోజులకే ఆసుపత్రిలో సోనాక్షి!
అయితే తాజాగా సోనాక్షి సిన్హా ఆసుపత్రిలో కనిపించడం నెట్టింట చర్చనీయాశంగా మారింది. పెళ్లైన వారం రోజులకే సోనాక్షి భర్త ఇక్బాల్ తో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కనిపించింది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల ప్రేమ బంధానికి పెద్దల్ని ఒప్పించి వివాహంతో పుల్ స్టాప్ పెట్టారు. దీంతో సోనాక్షి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారం భమైంది. కెరీర్ పరంగా అమ్మడు ఎలా ముందుకు సాగుతుంది? మునుపటిలా అదే దూకుడుతో కొనసా గుతుందా? ఏవైనా మార్పులు చేస్తుందా? అన్నది చూడాలి.
అయితే తాజాగా సోనాక్షి సిన్హా ఆసుపత్రిలో కనిపించడం నెట్టింట చర్చనీయాశంగా మారింది. పెళ్లైన వారం రోజులకే సోనాక్షి భర్త ఇక్బాల్ తో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో కనిపించింది. దీంతో నెట్టింట ఆసక్తికర చర్చకు తెర తీసినట్లు అయింది. సోనాక్షి గర్భం దాల్చిందా? రెగ్యులర్ చెకప్ లో భాగంగా వచ్చిందా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ కాసేపటికే ఇదంతా తప్పుడు ప్రచారమని తేలింది.
తండ్రి శత్రుజ్ఞు సిన్హా రెగ్యులర్ చెకప్ కోసమే భర్తతో కలిసి వచ్చిందని బాలీవుడ్ మీడియాలో వార్తలొ స్తున్నాయి. నేరుగా ఆమె డాక్టర్లు తండ్రి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని వెళ్లినట్లు సమాచారం. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండమని డాడ్ కి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోనాక్షి బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. అందులో కాకుడా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది.
జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే `నిక్తారాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్ నెస్` అనే మరో సినిమా చేస్తుంది. సోనాక్షి సౌత్ లోనూ ఇప్పటికే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన `లింగ` సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా తర్వాత అమ్మడు మళ్లీ మరో సినిమా చేయలేదు.