ఐషా శర్మ ఇన్నర్ సొగసు చూడతరమా?
పెద్ద స్క్రీన్‌కు మించి సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటుంది.
అథ్లెట్ కం నటి ఐషా శర్మ కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మోడల్‌గా సుపరిచితం. అటుపై పెప్సీ, లాక్మే వంటి బ్రాండ్‌లకు ప్రచారకర్తగా కొనసాగింది. దేశంలోని అత్యంత పాపులర్ డిజైనర్లలో కొందరి కోసం ర్యాంప్ వాక్ చేసింది. సత్యమేవ జయతేలో జాన్ అబ్రహాం సరసన అద్భుతమైన పాత్రతో నటనలోను ఒక ముద్ర వేసింది. పెద్ద స్క్రీన్‌కు మించి సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటుంది.
ముఖ్యంగా ఐషా శర్మ హాట్ ఫోటోషూట్లు ఇన్ స్టా మాధ్యమంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఐషా మరో బోల్డ్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐషా బ్లేజర్ ధరించి టాప్ లెస్ గా ఫోజులిచ్చింది. తన అందాలను దాచేందుకు ఎలాంటి ఆచ్ఛాదనతో పని లేకుండా ఇన్నర్ దుస్తులు ధరించకుండా ఘాటైన ఫోజిచ్చింది. ఇక బాటమ్ లో బ్లేజర్ కి కాంబినేషన్ కలర్ తో ఉన్న లూజ్ ఫార్మల్ ఫ్యాంట్ ని ధరించింది. ఐషా కిల్లింగ్ స్ట్రైకింగ్ లుక్ ఇప్పుడు నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఫెంటాస్టిక్ మోడలింగ్ పిక్చర్ అంటూ ఒక అభిమాని ఇన్ స్టాలో కామెంట్ చేయగా, ఐషా ఈ లుక్ లో హాట్ గా ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐషా శర్మ అందం గురించి అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే తనదైన టోన్డ్ రూపం వెనక కఠోర శ్రమ ఉందని ఇటీవలి ఇంటర్వ్యూలో ఐషా వెల్లడించింది. నేను ప్రతిరోజు చేసే స్వీయ సంరక్షణ అభ్యాసం లో ముఖ్యంగా... జిమ్‌కి వెళ్లడం, స్విమ్మింగ్ చేయడం, బైకింగ్ చేయడం లేదా నడవడం వంటి ఏవైనా కదలికలు మేలైనవి. ఇది మానసిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. నా సూచన ఏమిటంటే, వ్యాయామం చేయడం లేదా నడవడం శారీరక శ్రమకు సహాయపడుతుంది. వ్యాయామం నిజంగా ఆరోగ్యంపై గొప్పగా పనిచేస్తుందని నేను కనుగొన్నాను.
అన్ని ఊహలను ఉత్సాహాన్ని చంపే భయంకరమైన రొటీన్ పనుల నుండి పారిపోవడానికి ప్రజలు ప్రయాణిస్తారని చెప్పే ఒక కోట్ ఉంది. కొంతవరకూ అది నిజమని నేను భావిస్తున్నాను. అయినప్పటికీ, ప్రయాణం మీకు అందించే ఉత్సాహం జీవితాన్ని కొత్త లెన్స్ ద్వారా చూసే అవకాశం గురించి కూడా నేను నమ్ముతున్నాను. ఈ సంవత్సరం నేను మునుపెన్నడూ వెళ్లని కొత్త గమ్యస్థానాలకు వెళ్లాలనుకుంటున్నాను. నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చే ఒక ప్రదేశం పారిస్. ఇది నా ఫ్యాషన్ భావనను మార్చింది. నేను కూడా నా కుటుంబంతో సమయం గడపడానికి చికాగోకు వెళ్తూ ఉంటాను. ఇది నేను డిస్‌కనెక్ట్ చేసి రీఛార్జ్ చేయగల స్థలం. పరోక్షంగా ఇది సృజనాత్మకంగా కూడా నన్ను ఫుల్ గా నింపుతుంది.
ఐషా శర్మకు `సత్యమేవ జయతే`లో నటించిన తర్వాత కూడా పెద్దతెర అవకాశాల్లేవ్. కనీసం వెబ్ సిరీస్ లు లఘు చిత్రాలు వంటివి కూడా ట్రై చేసినట్టు కనిపించలేదు. తన సోదరి నేహా శర్మ కెరీర్ కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. మునుముందు శర్మా గాళ్స్ విషయంలో ఈ సన్నివేశం మారుతుందేమో చూడాలి.