కెప్టెన్ మిల్లర్.. తెలుగులో వచ్చేది ఎప్పుడంటే..
ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
విలక్షణమైన నటనతో పాటు డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న హీరో ధనుశ్. చాలా ఏళ్లుగా కోలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ఆయన.. ఈ మధ్య కాలంలో మంచి ఉత్సాహంతో వరుస పెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సినిమా చేశారు.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళం, హిందీ, కన్నడలో రిలీజైనా.. తెలుగులో మాత్రం విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ అసలు రిలీజ్ అవుద్దా లేకుంటే నేరుగా ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ అనుమానపడ్డారు. ఈ నేపథ్యంలో మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేశ్ ప్రొడక్షన్స్.. కెప్టెన్ మిల్లర్ ను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
తెలుగులో కూడా సాలిడ్ ఫాలోయింగ్ ఉన్న ధనుశ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది. అరుణ్ మతేశ్వరన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ మూవీకి డైలాగ్స్ అందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగు టీజర్ కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మిగతా వెర్షన్లపై పలువురు నెటిజన్లు మిక్స్ డ్ రివ్యూలు ఇచ్చారు.
కానీ ధనుశ్ మాత్రం యాక్షన్ తో ఇరగదీశారని నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ధనుశ్ ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. సరైన కథ పడితే ధనుశ్ ఆన్ స్క్రీన్ వండర్స్ క్రియేట్ చేయగలడని మరోసారి నిరూపించారని చెబుతున్నారు. మరి ఈ సినిమా తెలుగులో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.