కెప్టెన్ మిల్లర్.. తెలుగులో రిస్క్ లేకుండా..
దానికోసం మూవీ నిడివి కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ 160 నిమిషాల నిడివి ఉంటే ఏకంగా 11 నిమిషాలు అవుట్ ఫుట్ ట్రిమ్ చేసి 149 నిమిషాల నిడివితో తెలుగులో రిలీజ్ చేస్తున్నారంట.
ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఒక్క తెలుగు భాషలో తప్ప మిగిలిన అన్ని లాంగ్వేజ్ లలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. పర్వాలేదనే టాక్ సొంతం చేసుకుంది. మరీ బ్లాక్ బస్టర్ హిట్ అనే మాట అయితే వినిపించలేదు. చిన్న చిన్న లోపాలు ఉన్న ఓవరాల్ గా మూవీ చూడదగ్గ చిత్రం అనిపించుకుంది.
ఇదిలా ఉంటే జనవరి 25న కెప్టెన్ మిల్లర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకి అందిస్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న నాలుగు తెలుగు సినిమాలు రేసులో ఉండటంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ పొంగల్ కానుకగా తమిళనాట రిలీజ్ కావడంతో అక్కడ వచ్చిన కొన్ని నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లు తెలుగు వెర్షన్ లో లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
దానికోసం మూవీ నిడివి కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ 160 నిమిషాల నిడివి ఉంటే ఏకంగా 11 నిమిషాలు అవుట్ ఫుట్ ట్రిమ్ చేసి 149 నిమిషాల నిడివితో తెలుగులో రిలీజ్ చేస్తున్నారంట. ఆడియన్స్ ల్యాగ్ వచ్చిందని కంప్లైంట్ చేసిన సన్నివేశాలని తొలగించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాల సందడి ఎలాగూ తగ్గిపోయింది. మరల ఫిబ్రవరి 7 వరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు.
ఈ టైంని కెప్టెన్ మిల్లర్ ఏమైనా వినియోగించుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా ధనుష్ ని తెలుగులో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. రఘువరన్ బీటెక్ తర్వాత అతని సినిమాలు రెగ్యులర్ గా తెలుగులో డబ్ అవుతున్నాయి. సర్ తో స్ట్రైట్ గా తెలుగు మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మిల్లర్ మూవీకి మంచి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ధనుష్ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా ధనుష్ మూవీ స్టార్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ పాజిటివ్ వైబ్ కూడా కెప్టెన్ మిల్లర్ కి కలిసొచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.