హీరోయిన్ మాల్వీ పై కూడా కేసు నమోదు!
ఇప్పటికే ఈ రాజ్ తరుణ్, లావణ్య, మాల్వీ మల్హోత్రా ప్రేమ కహానీ టాలీవుడ్ లో సంచలనంగా మారింది
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో రోజుకో కొత్త విషయం జరుగుతోంది. ఇప్పటికే ఈ రాజ్ తరుణ్, లావణ్య, మాల్వీ మల్హోత్రా ప్రేమ కహానీ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతోంది. లావణ్య తన దగ్గర ఉన్న అన్ని సాక్ష్యాలని తీసుకొని వచ్చి పోలీసులకి ఇచ్చింది. దీంతో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకున్నాడని, అతని కారణంగా గర్భవతిని అయ్యానని బలమైన సాక్ష్యాలు లావణ్య సమర్పించింది.
అలాగే రాజ్ తరుణ్, లావణ్య మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు, సోషల్ మీడియాలో మెసేజ్ లకి సంబందించిన స్క్రీన్ షాట్స్ కూడా లావణ్య సేకరించి పోలీసులకి ఇచ్చింది. లావణ్య మొదటి నుంచి మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడిపై ఆరోపణలు చేస్తూ వస్తోంది. వారు తనని చంపేస్తామని బెదిరిస్తున్నారని లావణ్య మీడియాతో చెప్పింది. అలాగే మాల్వీతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడు అని బలంగా వాదిస్తూ వస్తోంది.
మాల్వీ మల్హోత్రా ఈ విషయంలో రెండు సార్లు పోలీసులకి కలిసి లావణ్యపై ఫిర్యాదు చేసింది. అయితే లావణ్య మాల్వీ మల్హోత్రా తనని బెదిరించినట్లు బలమైన ఆధారాలని పోలీసులకి అందించింది. దీంతో రాజ్ తరుణ్ తో పాటు మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్యని మోసం చేయడం, బెదిరించడం, భయపెట్టడం వంటి సంఘటనలలో వీరి ముగ్గురు ప్రమేయం ఉందని పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
అందులో ఏ1గా రాజ్ తరుణ్, ఏ2గా మాల్వీ మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రా పేర్లు చేర్చారు. అలాగే తనని డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇరికించారని లావణ్య తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సినిమాల్లోకి వచ్చిన ఆరంభంలో రాజ్ తరుణ్ కి తాను 70 లక్షల రూపాయిల వరకు ఇచ్చానని లావణ్య తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ పై ఉచ్చుబిగుస్తున్నట్లు కనిపిస్తోంది.
కచ్చితంగా లావణ్య ఫిర్యాదుతో నమోదైన కేసుపై రాజ్ తరుణ్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే చట్టపరమైన చర్యలని కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చనే మాట వినిపిస్తోంది. ఇక లావణ్యని బెదిరించిన కేసులో హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై కేసు నమోదైన నేపథ్యంలో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.